ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతుండడం, ప్రభుత్వ, ప్రైవేట్ ల్యాబ్‌లలో వేలసంఖ్యలో ఆర్‌టీపీసీఆర్ నమూనాలు పేరుకుపోతున్న నేపథ్యంలో సగానికిపైగా ఖర్చు, సమయాన్ని ఆదా చేసే ‘డ్రై స్వాబ్’ విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సీసీఎంబీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా త్వరలో దేశవ్యాప్తంగా 500 ప్రభుత్వ, ప్రైవేట్ ల్యాబ్‌ల సిబ్బందికి ఆన్‌లైన్ వేదికగా శిక్షణనివ్వనున్నట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు.
ఏంటి తేడా..?
ప్రస్తుతం ఆర్‌టీపీసీఆర్ పరీక్షలో భాగంగా బాధితుల నుంచి సేకరించిన గొంతు, ముక్కు స్రావాల నమూనాలను వైరల్ ట్రాన్స్‌పోర్టు మీడియం (వీటీఎం) ద్రావణంలో ఉంచి ల్యాబ్‌కు తరలిస్తున్నారు. దీన్ని తరలించే సమయంలో ద్రావణం లీకేజీ ద్వారా ఫలితాల్లో తేడాలే కాకుండా వైద్య సిబ్బందీ వైరస్‌కు గురవుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ సమస్యను అధిగమించేందుకు సీసీఎంబీ డ్రైస్వాబ్ కిట్‌ను రూపొందించింది. పొడిగా ఉండే స్వాబ్ కిట్ ద్వారా నేరుగా ఆర్‌టీపీసీఆర్ చేసేయొచ్చు. ఆర్‌ఎన్‌ఏ వెలికితీసే సౌకర్యాలు లేని సాధారణ కేంద్రాల్లో ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అన్నీ ఆదా..!