తెలంగాణ

telangana

ETV Bharat / city

మారని మందుబాబుల తీరు - new year

ఎన్ని నిబంధనలు పెట్టినా మందుబాబుల తీరు మారడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన డ్రంక్​ అండ్​ డ్రైవ్​ తనిఖీల్లో 3 వేలకు పైగా కేసులు నమోదవ్వడం గమనార్హం. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని పోలీసులు ఎంత హెచ్చరించినా మందుబాబులు ఖాతరు చేయడం లేదు.  పట్టుబడిన వారని కోర్టులో హాజరుపరిచి కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్​ ఇవ్వనున్నారు.

drunken drive in telangana
మారని మందుబాబుల తీరు

By

Published : Jan 1, 2020, 7:39 PM IST

నూతన సంవత్సర వేడుకలకు పోలీసులు ఎన్ని నిబంధనలు పెట్టినా మందు బాబుల తీరు మాత్రం మారలేదు. తాగి వాహనాలు నడిపి ట్రాఫిక్ పోలీసులకు చిక్కారు. నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో 2105 కేసులు నమోదు కాగా... రాష్ట్ర వ్యాప్తంగా 239 చోట్ల నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 3148 కేసులు నమోదయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు వారి వాహనాలు సీజ్ చేశారు. అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 951 కేసులు నమోదయ్యాయి. సైబరాబాద్​లో 873, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 281 కేసులు నమోదయ్యాయి.. అయితే ఈ కేసుల్లో ముఖ్యంగా 18 నుంచి 30 ఏళ్ళలోపు వారు అధికంగా ఉండటం గమనార్హం.
మద్యం సేవించి వాహనాలు నడపొద్దని పోలీసులg ఎంతగా హెచ్చరించినా కొంత మంది వాహనదారులు మాత్రం పట్టించుకోలేదు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఓ ద్విచక్ర దారునికి ఏకంగా 550 పాయింట్లు నమోదవడంతో పోలీసులే అవాక్కయ్యారు. ఈ సంవత్సరంలో నమోదైన అత్యధిక మద్యం మోతాదు రీడింగ్ అని తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సారి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో కేవలం ఒక్క మహిళ మాత్రమే పట్టుబడటం గమనార్హం. పట్టుబడిన వారి వాహనాలను సీజ్ చేసిన పోలీసులు... కోర్టులో హజరు పరిచిన అనంతరం కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు.

మారని మందుబాబుల తీరు

ABOUT THE AUTHOR

...view details