Drugs in Visakha: ఏపీలోని విశాఖలో డ్రగ్స్ కలకలం రేపింది. 54 గ్రాముల మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పూర్తి వివరాలను సాయంత్రం అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. కాగా కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ పబ్‌ను అర్ధరాత్రి దాటినా నడపటం, పోలీసుల డెకాయ్ ఆపరేషన్‌లో భారీగా మత్తు పదార్థాలు దొరకడం సంచలనం సృష్టించింది. ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. ఇంతలోనే ఏపీలో మాదకద్రవ్యాలు బయటపడటం ఆందోళన కలిగించే అంశం.
విశాఖలో డ్రగ్స్ కలకలం.. 54 గ్రాముల మాదకద్రవ్యాలు స్వాధీనం - పోలీసుల అదుపులో ముగ్గురు
Drugs in Visakha: తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ కలకలం సృష్టిస్తోంది. పబ్‌లు, పోలీసుల తనిఖీల్లో భారీగా డ్రగ్స్, గంజాయి పట్టుబడటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో మత్తు పదార్థాలు బయటపడగా.. తాజాగా ఏపీలోని విశాఖలో మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
విశాఖలో డ్రగ్స్ కలకలం