ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనిగిరి మండలం చల్లగిరిగల గ్రామంలోని రైతులు కరివేపాకును విస్తారంగా సాగు చేస్తున్నారు. ఈ పంటను స్థానికంగా ఉన్న కనిగిరితో పాటు, ఒంగోలు, విజయవాడ, హైదరాబాద్, తదితర మార్కెట్లకు తరలిస్తుంటారు. అయితే, కరోనా దెబ్బతో రవాణా స్తంభించిపోవడం వల్ల కరివేపాకు రైతులకు నష్టాల తిప్పలు తప్పడం లేదు.
లాక్డౌన్తో కరివేపాకు సాగు రైతుల కష్టాలు - farmers problems in cultivation
కరోనా ప్రభావంతో....కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్డౌన్... రైతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు తగిన ప్రతిఫలం లభించక శ్రమ జీవులు ఆందోళన చెందుతున్నారు. ఏపీలోని ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలో కరివేపాకును సాగు చేస్తున్న రైతుల కష్టాలు వర్ణణాతీతం.
లాక్డౌన్తో కరివేపాకు సాగు రైతుల కష్టాలు
ఎకరాకు రూ. 40,000 పెట్టుబడి పెట్టామని, తీరా పంట చేతికొచ్చే సమయంలో కరోనా రూపంలో ప్రమాదం ముంచుకొచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం గిట్టుబాటు ధర కూడా రావట్లేదని శ్రమ జీవులు వాపోతున్నారు. లాక్డౌన్ వల్ల రవాణా స్తంభించిపోవటం వల్ల కరివేపాకు తోటల్లోనే మగ్గిపోతుందని రైతులు ఆందోళన వెల్లిబుచ్చుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి:మిడతల దాడి మళ్లీ మొదలు- జనం గుండెల్లో గుబులు