డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లు, పర్మిట్లు, రిజిస్ట్రేషన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వ తీపికబురు అందించింది. డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసినా జూన్ 30 వరకు చెల్లుబాటు అయ్యేలా వెసులుబాటు కల్పిస్తూ రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 1 నుంచి జూన్ 30 వరకు గడువు ముగిసిన, ముగుస్తోన్న వాహనాలపై ఎన్ఫోర్స్మెంట్ యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది.
డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసిందా.. ఏం పర్లేదు. - corona effect
అసలే లాక్డౌన్.. బయటకు వెళ్తే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలోనే డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసిందని, వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లు, పర్మిట్లు లభించలేదని ఆందోళన చెందుతున్నారా? అయితే మీకోసం ఓ శుభవార్తను అందించింది రవాణా శాఖ
డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసిందా.. ఏం పర్లేదు.
రాష్ట్రంలో చాలా మంది డ్రైవింగ్ లైసెన్స్ కోసం ధరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే ఫీజులు చెల్లించిన వారు, వాహనాల ఫిట్నెస్ ముగిసినవారు, డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగుస్తోన్న వారు ఉన్నారు. వీరంతా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రవాణాశాఖ అధికారులు వెల్లడించారు.
ఇవీ చూడండి:కరోనా నియంత్రణకై సరికొత్త ఎయిర్ ప్యూరిఫైయర్