తహసీల్దార్ విజయారెడ్డి డ్రైవర్ గురునాథం ఇవాళ డీఆర్‌డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సంతోష్ నగర్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గురునాథం మంటల్లో కాలిపోతున్న విజయా రెడ్డిని కాపాడే ప్రయత్నంలో అగ్నికి ఆహుతయ్యాడు. కాపాడుతున్న తరుణంలో దాదాపు 80 శాతం పైగా కాలిపోయిన గురునాథంను పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్‌కు ఓ కుమారుడు, భార్య(7 నెలల గర్భవతి) ఉన్నారు. అపోలో ఆసుపత్రి ప్రాంగణంలో గురునాథం మృతితో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
తహసీల్దార్ విజయారెడ్డి డ్రైవర్ గురునాథం మృతి - driver chendrayya died
విజయారెడ్డి హత్య కేసులో డ్రైవర్ గురునాథం మృతి
10:55 November 05
తహసీల్దార్ విజయారెడ్డి డ్రైవర్ గురునాథం మృతి
Last Updated : Nov 5, 2019, 12:55 PM IST