ఆంధ్ర ప్రదేశ్లోని విశాఖలోని ఎల్జీ పాలిమర్స్నుంచి విడుదలైన విష వాయువువెంకటాపురం గ్రామస్థులను ఇంకా వేధిస్తోంది. స్టైరీన్ గ్యాస్ ధాటికి భూగర్భ జలాలు పూర్తిగా రంగు మారి స్వచ్ఛతను కోల్పోయాయి. పెట్రోల్, డీజీల్ రూపంలోకి మారిపోయాయి.
'స్టైరీన్ గ్యాస్ కంటే తాగునీరే ప్రమాదకరంగా ఉంది' - venkatapuram village news
స్టైరీన్ గ్యాస్ లీకేజీ ప్రభావిత గ్రామాల్లో తాగు నీటి సమస్య ప్రజలను ఇబ్బంది పెడుతోంది. రసాయన వాయువు వెలువడిన తరవాత భూగర్భ జలాలు పూర్తిగా కలుషితం అయ్యాయని స్థానికులు చెబుతున్నారు. జరిగిన ప్రమాదం కంటే బాధిత గ్రామాల్లో కలుషిత నీరు వల్ల ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
'స్టైరీన్ గ్యాస్ కంటే తాగు నీరే ప్రమాదకరంగా ఉంది'
పరీక్షల కోసం అధికారులు నీటి నమూనాలను సేకరించినా... ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్థులు వాపోతున్నారు. జరిగిన ప్రమాదం కంటే బాధిత గ్రామాల్లో కలుషిత నీరు వల్ల ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. కలుషిత నీటిని తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న బాధిత గ్రామస్థుల పరిస్థితిని మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు.
ఇవీ చూడండి:స్వచ్ఛతే ఆరోగ్య సోపానం.. అవగాహనే కీలకం