తెలంగాణ

telangana

ETV Bharat / city

మందుబాబు హల్​చల్​.. కానిస్టేబుల్​పై దాడి - మందుబాబు హల్​చల్

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఓ మద్యం దుకాణం వద్ద వ్యక్తి హల్​చల్​ చేశాడు. మద్యం మత్తులో ఓ కానిస్టేబుల్​పై దాడి చేశాడు. నిబంధనలు పాటించాలని సూచించినందుకు దాడికి పాల్పడ్డాడు. నిందితునిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

drinker-attacked-police-constable-at-wine-shop-in-ap
మందుబాబు హల్​చల్​.. కానిస్టేబుల్​పై దాడి

By

Published : Jun 5, 2020, 7:25 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాకుళం జిల్లా రాజాంలో ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద విధులు నిర్వహిస్తోన్న జగన్నాథం అనే పోలీస్ కానిస్టేబుల్​పై ఓ వ్యక్తి దాడి చేశాడు. అప్పటికే మద్యం సేవించి ఉన్న వ్యక్తి మద్యం కొనుగోలు కోసం దుకాణం వద్దకు వచ్చాడు. ఈ క్రమంలో నిబంధనలు పాటించాలని సూచిస్తున్న కానిస్టేబుల్​పై దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో అక్కడి కొద్దిసేపు వివాదం నెలకొంది. కానిస్టేబుల్​పై దాడి చేసిన వ్యక్తిపై రాజాం పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదైంది.

ABOUT THE AUTHOR

...view details