భారత వైమానిక దళాన్ని బలోపేతం చేసేందుకు 48వేల కోట్లతో 83 తేజస్ ఫైటర్ జెట్లు సమకూర్చాలని కేంద్ర కేబినేట్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుందని డీఆర్‌డీఓ ఛైర్మన్ సతీష్ రెడ్డి తెలిపారు. ఈ నిర్ణయం రక్షణ రంగంలో స్వయం సమృద్ధికి దోహదపడుతుందని అన్నారు.
రానున్న రోజుల్లో తేజస్ ముఖ్య పాత్ర పోషించనుంది: డీఆర్డీవో ఛైర్మన్ - Sankranti celebrations in Mahimalur, Nellore district
డీఆర్డీవో ఛైర్మన్ సతీశ్ రెడ్డి సొంత గ్రామం ఏపీలోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరులో సంక్రాంతి సంబురాల్లో పాల్గొన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. భారత వైమానిక దళాన్ని బలోపేతం చేసేందుకు 48వేల కోట్లతో 83 తేజస్ ఫైటర్ జెట్లు సమకూర్చాలని కేంద్ర కేబినేట్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు.
రానున్న రోజుల్లో తేజస్ ముఖ్య పాత్ర పోషించనుంది: డీఆర్డీవో ఛైర్మన్
సొంత గ్రామం ఏపీలోని నెల్లూరు జిల్లా మహిమలూరులో సంక్రాంతి సంబురాల్లో పాల్గొన్న సతీశ్ రెడ్డి... రానున్న రోజుల్లో భారత వైమానిక దళంలో తేజస్ ముఖ్య పాత్ర పోషించనుందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి అభినందనలు తెలిపారు.
ఇదీ చదవండి: 'జాతీయ క్రీడలకు చిరునామాగా.. పాలమూరు'