తెలంగాణ

telangana

ETV Bharat / city

'పాలకుల తీరుతో తెలుగు భాష కనుమరుగయ్యే ప్రమాదం' - ద్రవిడ నాడు ఆధ్వర్యంలో ఆందోళన

హైదరాబాద్​ రవీంద్రభారతిలోని పర్యటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఛాంబర్ ముందు ద్రవిడ నాడు ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. రానున్న రోజుల్లో తెలుగు బాష కనుమరుగయ్యే విధంగా పాలకులు వ్యవహరిస్తున్నారని ద్రవిడ నాడు జాతీయ అధ్యక్షుడు కిన్నెర సిద్ధార్థ ఆరోపించారు.

dravida nadu protested at ravindra bharathi for protecting telugu language
dravida nadu protested at ravindra bharathi for protecting telugu language

By

Published : Dec 22, 2020, 3:32 PM IST

తెలుగు భాషను పరిరక్షించాలంటూ... ద్రవిడ నాడు ఆధ్వర్యంలో హైదరాబాద్ భాషా మంత్రిత్వశాఖ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. 1966 అధికార బాషా చట్టాన్ని, 1988 తెలంగాణ దుకాణదారుల సంస్థల చట్టాన్ని అమలు చేయాలంటూ.... రవీంద్రభారతి ప్రాంగణంలోని పర్యటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఛాంబర్ ముందు బైఠాయించారు. రానున్న రోజుల్లో తెలుగు బాష కనుమరుగయ్యే విధంగా పాలకులు వ్యవహరిస్తున్నారని ద్రవిడ నాడు జాతీయ అధ్యక్షుడు కిన్నెర సిద్ధార్థ ఆరోపించారు.

రాష్ట్రంలో వ్యాపార సంస్థల బోర్డులు తెలుగులో తప్పనిసరిగా ఉండాలని చట్టం ఉన్నప్పటికీ... అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని సిద్ధార్థ విమర్శించారు. దొడ్డిదారిన తెలుగు పాఠ్యంశాలలో 24 సంస్కృత అక్షరాలను చేర్చారని... వాటిని తొలిగించి తెలుగు బాషలోనే పాఠ్యంశాలను తయారు చేయాలని కోరారు. ఈ విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే తెలుగు భాషా ప్రేమికులను ఐక్యం చేసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి: రుణ యాప్​లపై దర్యాప్తు ముమ్మరం... అదుపులో నలుగురు

ABOUT THE AUTHOR

...view details