తెలంగాణ

telangana

ETV Bharat / city

Dr. Raghu Ram : బ్రిటిష్‌ పురస్కారం అందుకున్న డాక్టర్‌ రఘురాం - Officer of the Most Excellent Order of the British Empire

Dr. Raghu Ram : ఉషాలక్ష్మీ బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘురామ్‌ను ‘ఆఫీసర్‌ ఆఫ్‌ ది మోస్ట్‌ ఎక్స్‌లెంట్‌ ఆర్డర్‌ ఆఫ్‌ బ్రిటిష్‌ ఎంపైర్‌ (ఓబీఈ)’ అవార్డుతో బ్రిటీష్ ఎంపైర్ గౌరవించింది. భారత సంతతికి చెందిన అతిపిన్న వయస్కులైన సర్జన్‌లలో ఒకరిగా రఘురామ్‌ను ఆ దేశ ప్రభుత్వం పేర్కొంది. బ్రిటిష్‌ రాజకుటుంబం నివసించే విండ్సర్‌ క్యాజిల్‌లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రిన్స్‌ ఛార్లెస్‌ ఈ అవార్డును డాక్టర్‌ రఘురామ్‌కు అందజేశారు.

Dr. Raghu Ram
Dr. Raghu Ram

By

Published : Mar 31, 2022, 9:35 AM IST

Dr. Raghu Ram : బ్రిటిష్‌ ప్రభుత్వం అందజేసే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘ఆఫీసర్‌ ఆఫ్‌ ది మోస్ట్‌ ఎక్స్‌లెంట్‌ ఆర్డర్‌ ఆఫ్‌ బ్రిటిష్‌ ఎంపైర్‌ (ఓబీఈ)’ను తెలంగాణకు చెందిన ప్రముఖ రొమ్ము వ్యాధుల శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్‌ రఘురాం అందుకున్నారు. బ్రిటిష్‌ రాజకుటుంబం నివసించే విండ్సర్‌ క్యాజిల్‌లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రిన్స్‌ ఛార్లెస్‌ ఈ అవార్డును డాక్టర్‌ రఘురాంకు అందజేశారు.

యూకేలో అత్యున్నత పురస్కారం ‘నైట్‌ హుడ్‌’ కాగా.. దాని తర్వాత రెండో అత్యున్నత పురస్కారం ఓబీఈ. వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన వారికి దీనిని అందజేస్తారు. భారత్‌లో రొమ్ము క్యాన్సర్‌ నివారణ, చికిత్స, అవగాహనలో డాక్టర్‌ రఘురామ్‌ అందిస్తున్న విశేష సేవలకుగాను ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు గత ఏడాది బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రకటించింది.

ABOUT THE AUTHOR

...view details