తెలంగాణ

telangana

ETV Bharat / city

UKHCDO: యూకేహెచ్‌సీడీఓ ఛైర్‌పర్సన్‌గా.. తొలి తెలుగు మహిళ - యూకేహెచ్‌సీడీఓ ఛైర్‌పర్సన్‌

UKHCDO: ‘ద యునైటెడ్‌ కింగ్‌డమ్‌ హీమోఫీలియా సెంటర్‌ డాక్టర్స్‌ ఆర్గనైజేషన్‌ (యూకేహెచ్‌సీడీఓ)’ ఛైర్‌పర్సన్‌గా ఏపీకి చెందిన ప్రొఫెసర్‌ డా.ప్రతిమాచౌదరి మావిళ్లపల్లి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ పదవికి ఎన్నికైన తొలి తెలుగు వ్యక్తిగా ఆమె రికార్డు సృష్టించారు.

pratima
pratima

By

Published : Jul 23, 2022, 7:58 AM IST

UKHCDO: బ్రిటన్‌, స్కాట్లాండ్‌, ఉత్తర ఐర్లాండ్‌, వేల్స్‌లలోని హీమోఫీలియా సెంటర్‌ వైద్యులకు సంబంధించిన ‘ద యునైటెడ్‌ కింగ్‌డమ్‌ హీమోఫీలియా సెంటర్‌ డాక్టర్స్‌ ఆర్గనైజేషన్‌ (యూకేహెచ్‌సీడీఓ)’ ఛైర్‌పర్సన్‌గా ఆంధ్రప్రదేశ్​కి చెందిన ప్రొఫెసర్‌ డా.ప్రతిమాచౌదరి మావిళ్లపల్లి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ పదవికి ఎన్నికైన తొలి తెలుగు వ్యక్తిగా ఆమె రికార్డు సృష్టించారు. ఆమె ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగుతారు. ప్రతిమా చౌదరి తల్లిదండ్రులు మావిళ్లపల్లి వెంకటరమణయ్య చౌదరి, సరోజని హైదరాబాద్‌లో నివసించేవారు.

ఆమె ఉస్మానియాలో ఎంబీబీఎస్‌, ఎండీ కోర్సులు, బ్రిటన్‌లో ఎంఆర్‌సీపీ, ఫెలోషిప్‌ ఎగ్జామినేషన్‌ ఆఫ్‌ ది రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ పెథాలజిస్ట్స్‌ (ఎఫ్‌ఆర్‌సీపాత్‌) పూర్తిచేసి 1998 నుంచి లండన్‌లో వైద్యురాలిగా సేవలందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌లో ప్రొఫెసర్‌గా, కేథరిన్‌ డార్మండీ హీమోఫీలియా అండ్‌ థ్రాంబోసిస్‌ సెంటర్‌ డైరెక్టర్‌గాను విధులు నిర్వహిస్తున్నారు. ప్రొఫెసర్‌ డా.ప్రతిమా చౌదరి హీమోఫీలియా, థ్రాంబోసిస్‌, జీన్‌థెరపీలపై అంతర్జాతీయ జర్నల్స్‌లో వందకుపైగా పరిశోధన పత్రాలు రాశారు. పీహెచ్‌డీ చేస్తున్న అభ్యర్థులకు గైడ్‌గా, వివిధ అంతర్జాతీయ మెడికల్‌ కంపెనీలకు సలహాదారుగా వ్యవహరిస్తున్నారు.

ఇవీ చదవండి :గుండెల్లో 'ఝల్లు'.. మళ్లీ కుండపోత వర్షాలు.. ఐదు జిల్లాలకు 'రెడ్​' అలర్ట్​

ABOUT THE AUTHOR

...view details