తెలంగాణ

telangana

ETV Bharat / city

ఎన్​ఎంసీ సెర్చ్‌ కమిటీ సభ్యుడిగా డా.నాగేశ్వరరెడ్డి - nmc search committee

జాతీయ వైద్య కమిషన్‌ ఏర్పాటు చేయనున్న వైద్యమండళ్లలో సభ్యుల నియామకాలపై కేంద్రం సెర్చ్​ కమిటీని నియమించింది. కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో ఆరుగురు సభ్యులు ఉంటారు. ఏషియన్​ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ ఛైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డిని ఒక సభ్యుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఎన్​ఎంసీ సెర్చ్‌ కమిటీ సభ్యుడిగా డా.నాగేశ్వరరెడ్డి

By

Published : Oct 31, 2019, 1:19 PM IST

జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) పరిధిలో కొత్తగా ఏర్పాటు చేయనున్న వేర్వేరు వైద్యమండళ్లలో సభ్యుల నియామకాలపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ సెర్చ్‌ కమిటీని నియమించింది. కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శి ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో ఆరుగురు సభ్యులుంటారు. వీరిలో తెలంగాణ నుంచి జీర్ణకోశ వ్యాధుల నిపుణులు, ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ ఛైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డిని ఒక సభ్యుడిగా నియమించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ కార్యదర్శి కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు.

ఆయుర్వేద బోర్డ్, ​యునానీ, సిద్ధ బోర్డ్, మెడికల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ రేటింగ్‌ బోర్డు ఫర్‌ ఇండియన్‌ సిస్టం ఆఫ్‌ మెడిసిన్‌ తదితర విభాగాలకు సంబంధించిన బోర్డుల్లో సభ్యులను నియమించడానికి వీలుగా అర్హులైన అభ్యర్థులను ప్రభుత్వానికి ఈ సెర్చ్​ కమిటీ సిఫార్సు చేస్తుంది. దేశంలో వైద్యవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో కొత్తగా ఏర్పడనున్న బోర్డులు క్రియాశీలకంగా పనిచేస్తాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details