తెలంగాణ

telangana

ETV Bharat / city

'యోగా, వ్యాయామం ఎంతగానో ఉపయోగపడుతాయి' - అమెరికాలో కరోనా కేసులు

రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు వ్యాయామం.. ప్రాణాయామమం చేయాలని న్యూయార్క్‌లోని ప్రవాస భారతీయ ప్రముఖ వైద్యులు డాక్టర్‌ మధు కొర్రపాటి సూచించారు. ప్రాసెస్డ్‌ ఆహార పదార్థాలను తినవద్దని... స్నాక్స్‌, శీతల పానీయాలకు దూరంగా ఉండాలని తెలిపారు. అమెరికా, న్యూయార్క్​లో కరోనా విజృంభనపై ఈటీవీ భారత్ ముఖాముఖిలో మాట్లాడారు.

coronavirus pandemic in new york
coronavirus pandemic in new york

By

Published : Apr 16, 2020, 10:46 AM IST

ప్రముఖ వైద్యులు డాక్టర్‌ మధు కొర్రపాటితో ముఖాముఖి

న్యూయర్క్​తో పాటు అమెరికాలో ఎలాంటి వాతారవరణం ఉంది?

అమెరికాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. 6 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. న్యూయార్క్​లోనే ఎక్కువ కేసులున్నాయి.

న్యూయార్క్​లో ఇలాంటి పరిస్థితికి కారణం ఏంటి?

న్యూయార్క్​లో జనసాంధ్రత ఎక్కువ. ప్రతిరోజూ 40 నుంచి 50 లక్షల మంది ప్రయాణిస్తారు. అందుకే వైరస్ వ్యాప్తి పెరిగింది.

కరోనా కట్టడికి అమెరికా పౌరులు ప్రభుత్వ సూచనలు పాటించలేదా. భౌతిక దూరం పాటించలేదా?

ప్రభుత్వం అప్రమత్తమయ్యేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వైరస్ వ్యాప్తి పెరిగిపోయింది. ఇండియాలోలాగా నిబంధనలు కచ్చితంగా అమలు కాలేదు.

అమెరికాలో కరోనా కేసులు ఎలా ఉంటున్నాయి?

80 శాతం మందికి లక్షణాలు తక్కువగానే ఉంటాయి. వాళ్లు తొందరగానే కోలుకుంటున్నారు. 20శాతం మందిలో మాత్రం తీవ్రత ఎక్కువగా ఉంటోంది.

ఏలాంటి అలవాట్లు ఉన్నవారికి కరోనా ప్రభావం తీవ్రంగా ఉంటుంది?

ఊపిరితిత్తుల సమస్యలున్నవారికి, పొగతాగే వారికి, ఈ సిగరేట్​ తాగేవారికి, క్యాన్సర్​, ఊబకాయం ఉన్నవారిపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. డయాలసిస్​ చేసుకునేవారు జాగ్రత్తగా ఉండాలి.

కరోనా నుంచి కోలుకున్నవారికి మళ్లి వచ్చే అవకాశం ఉందా?

కరోనా నుంచి కోలుకున్నవారికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉన్నవారికి కరోనా మళ్లి వచ్చే అవకాశం లేదు. చైనాలో అంలాంటి కేసులు కొన్ని వచ్చాయని చెబుతున్నారు.

కరోనా నుంచి రక్షించుకునేందుకు భారతీయులకు ఎలాంటి సూచనలు ఇస్తారు?

వ్యాయామం, యోగా చేయాలి. ప్రాణాయామం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓం అనే మంత్రం అన్ని నాడుల్ని కదిలిస్తుంది. కపాలభాతి ఆసనం ఎంతగానో మేలు చేస్తుంది. కూరగాయలు, పండ్లు తినాలి. అల్లం టీ, పాలల్లో పసుపు వెసుకొని తాగాలి. జంక్​ పుడ్​లు తినొద్దు.

ఇదీ చూడండి:'పరీక్షల సంఖ్య పెరిగితేనే కరోనా కట్టడి సాధ్యం'

ABOUT THE AUTHOR

...view details