యశోద ఆస్పత్రుల్లో గుండె, ఊపిరితిత్తుల మార్పిడి విభాగానికి చెందిన సీనియర్ హార్ట్-లంగ్ ట్రాన్స్ ప్లాంట్ సర్జికల్ డైరెక్టర్, యశోద హాస్పిటల్స్ డాక్టర్.జ్ఞానేష్ థాకర్, ప్రపంచవ్యాప్తంగా 500 కంటే ఎక్కువ గుండె, ఊపిరితిత్తుల మార్పిడి చేసి అరుదైన మైలురాయిని సాధించారు. డాక్టర్.జ్ఞానేష్ థాకర్ శిక్షణ కోసం యూఎస్‌ఎకు వెళ్లడానికి ముందు కార్డియోథొరాసిక్ సర్జన్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఆస్ట్రియా, యుపీఎంసీ, పిట్స్‌బర్గ్, టెంపుల్ యూనివర్సిటీ ఫిలడెల్ఫియాతో సహా గుండె, ఊపిరితిత్తుల మార్పిడిలో ప్రపంచంలోని అగ్రశ్రేణి కేంద్రాలలో ప్రాక్టీస్ చేశారు. కేవలం 3 నెలల్లో 70కి పైగా గుండె, ఊపిరితిత్తుల మార్పిడి చేసినందుకుగానూ అక్కడి ప్రముఖ మ్యాగజైన్ “టెంపుల్ క్యాప్సూల్ మ్యాగజైన్” కవర్ పేజీలో ప్రచురించింది.
డాక్టర్.జ్ఞానేష్ థాకర్ అప్పటి నుంచి యూఎస్‌లో ప్రముఖ డాక్టర్లలో ఒకరిగా కొనసాగుతున్నప్పటికీ... భారతదేశంలో గుండె, ఊపిరితిత్తుల మార్పిడికి మార్గదర్శకం వహించడానికి తిరిగి వచ్చారు. భారతదేశంలో ఒక రోగికి ఊపిరితిత్తుల మార్పిడిని విజయవంతంగా నిర్వహించిన మొదటి డాక్టర్ కూడా జ్ఞానేష్ థాకరే. అప్పటి నుంచి ఆయన తన టీచింగ్ ఆస్పత్రుల్లో గుండె, ఊపిరితిత్తుల మార్పిడి చేశారు. అతి తక్కువ ఇన్వాసివ్ (చిన్న గాటు)తో డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కూడా చేశారు.