తెలంగాణ

telangana

ETV Bharat / city

త్వరలోనే హైదరాబాద్​ రోడ్లపై డబుల్​ డెక్కర్​ బస్సులు... - hyderabad transport

త్వరలోనే హైదరాబాద్​ రోడ్ల మీద డబుల్​ డెక్కర్​ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. మరో రెండు రోజుల్లో ఆర్థిక కమిటీ బస్సుల ధరపై చర్చించనుంది. ఆ కమిటీ ఆమోద ముద్ర వేస్తే.. డబుల్ డెక్కర్ బస్సులను అశోక్ లేల్యాండ్ సంస్థ తయారుచేసి అందించనుంది.

double decker buses in hyderabad roads soon...
double decker buses in hyderabad roads soon...

By

Published : Mar 5, 2021, 8:29 PM IST

మరికొద్ది రోజుల్లో హైదరాబాద్ రోడ్లపై ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. గతంలో తిరిగిన డబుల్ డెక్కర్ బస్సులతో పోల్చితే... సాంకేతికపరంగా మంచి సామర్థ్యమున్న ఇంజిన్, హైదరాబాద్ రోడ్లకు అనువైన బస్సుబాడీ వంటివి ఉండాలని టెండరు దాఖలు చేసే సమయంలోనే ఆర్టీసీ సంస్థ స్పష్టం చేసింది. ఇటీవల దాఖలైన టెండర్లలో అశోక్ లేల్యాండ్ సంస్థ ఒకటే పాల్గొంది.

ఆర్టీసీ కోరిన విధంగా బస్సులను బాడీతో సహా సమకూర్చి ఇస్తామని అశోక్​ లేల్యాండ్​ తెలిపింది. మొదటి దశలో 25 బస్సులు కావాలని ఆర్టీసీ కోరగా... అందిస్తామని టెండరు దాఖలు చేసిన సంస్థ వెల్లడించింది. మరో రెండు రోజుల్లో ఆర్థిక కమిటీ బస్సుల ధరపై చర్చించనుంది. ఆ కమిటీ ఆమోద ముద్ర వేస్తే.. డబుల్ డెక్కర్ బస్సులను అశోక్ లేల్యాండ్ సంస్థ తయారుచేసి, సంస్థ కోరిన సమయానికి అందించనుంది.

ఇదీ చూడండి: 'కరెంట్​ పోతోంది... జనరేటర్​ ఇవ్వండి'

ABOUT THE AUTHOR

...view details