Dost Notification: తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల కావడంతో డిగ్రీ ప్రవేశాల కోసం నేడు దోస్త్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఉన్నత విద్యామండలి కార్యాలయంలో... దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మగాంధీ, శాతవాహన విశ్వవిద్యాలయాల పరిధిలో... వెయ్యికిపైగా కళాశాలల్లో సీట్లు భర్తీ చేయనున్నారు.
డిగ్రీ ప్రవేశాల కోసం నేడు దోస్త్ నోటిఫికేషన్ విడుదల - నేడు దోస్త్ నోటిఫికేషన్ రిలీజ్
Dost Notification: ఇంటర్ ఫలితాలు విడుదల కావడంతో డిగ్రీ ప్రవేశాల కోసం నేడు దోస్త్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఉన్నత విద్యామండలి కార్యాలయంలో... దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
Dost Notification
బీఏ, బీకాం, బీఎస్సీ తదితర సంప్రదాయ డిగ్రీలో దాదాపు నాలుగున్నర లక్షల సీట్లు ఉన్నాయి. మూడు లేదా నాలుగు విడతల్లో సీట్ల భర్తీ ప్రక్రియ జరగనుంది. దోస్త్ వెబ్ సైట్, టీఎస్ ఫోలియో యాప్ లేదా విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోని సహాయ కేంద్రాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు.
ఇవీ చదవండి: