తెలంగాణ

telangana

ETV Bharat / city

సీట్లు, కోర్సులు మార్చుకునేందుకు దోస్త్​ అవకాశం - dost intra college options

డిగ్రీ కళాశాలల్లో సీటు పొందిన విద్యార్థులు కోర్సుల విషయాల్లో ఏవైనా మార్పులుంటే చేసుకునే వెసులుబాటు ఇచ్చినట్లు దోస్త్ కన్వినర్ లింబాద్రి తెలిపారు. ఐచ్ఛికాలను ఈ నెల 17 నుంచి 21 వరకు దోస్త్ వెబ్​సైట్​లో సమర్పించేందుకు సమయం ఇచ్చినట్లు పేర్కొన్నారు.

సీట్లు, కోర్సులు మార్చుకునేందుకు దోస్త్​ అవకాశం
సీట్లు, కోర్సులు మార్చుకునేందుకు దోస్త్​ అవకాశం

By

Published : Nov 15, 2020, 10:52 PM IST

డిగ్రీలో సీటు పొందిన విద్యార్థులు కోర్సు మార్చుకునేందుకు అవకాశం కల్పించినట్టు దోస్త్ కన్వినర్ లింబాద్రి తెలిపారు. చేరిన కళాశాలలోనే కోర్సు, మాధ్యమం, కాంబినేషన్ మార్చుకునే అవకాశముందన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 17 నుంచి 21 వరకు దోస్త్ వెబ్​సైట్​లో ఐచ్ఛికాలు సమర్పించాలని లింబాద్రి తెలిపారు. ఈ నెల 21న కాలేజీ అంతర్గత మార్పుల సీట్లు కేటాయించనున్నట్టు పేర్కొన్నారు. ఇచ్చిన ఐచ్ఛికం ప్రకారం కోర్సు దక్కితే.. అంతకు ముందు కేటాయించిన కోర్సు రద్దయిపోతుందని లింబాద్రి వివరించారు.

ఇదీ చూడండి: అభిమానం చాటుకున్న ఫ్యాన్​... మందుబాబుల దిల్​కుశ్​

ABOUT THE AUTHOR

...view details