డిగ్రీ ప్రవేశాల కోసం ఈ నెలాఖరు వరకు మార్గదర్శకాలు జారీ చేయనున్నట్టు దోస్త్ కన్వీనర్, ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షుడు లింబాద్రి వెల్లడించారు. ఈ ఏడాదిలో కొత్త కోర్సులు ప్రవేశ పెట్టడం, పరీక్షా విధానంలో మార్పులు, డిటెన్షన్ విధానం రద్దు, ప్రైవేటు కళాశాలలకు గుర్తింపు పొడిగింపు వంటి నిర్ణయాలు వెల్లడిస్తున్న లింబాద్రితో ఈటీవీ భారత్ ముఖాముఖి...
'తక్కువ సమయం.. ఎక్కువ ప్రశ్నల ఛాయిస్'
కరోనా ప్రభావం డిగ్రీ ప్రవేశాలపై కూడా పడింది. ప్రత్యేక యాప్ ద్వారా ప్రక్రియ చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. యూజీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షా సమయం కుదించడమే కాకుండా ఎక్కువ ప్రశ్నలు ఛాయిస్‌గా ఇస్తామంటున్నారు. ఎన్నో మార్పులతో విద్యా సంవత్సరాన్ని నడపనున్నారు.
'తక్కువ సమయం.. ఎక్కువ ప్రశ్నల చాయిస్'