తెలంగాణ

telangana

ETV Bharat / city

సీఎం సహాయ నిధికి విరాళాలు - donations to fight against corona

కరోనా వ్యాప్తి నివారణపై రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా పలువురు విరాళాలు అందజేస్తున్నారు. కొంతమంది నేరుగా పేదలకు సరుకులు, కూరగాయలు అందిస్తూ సాయం చేయగా.. మరికొంత మంది సీఎం సహాయనిధికి విరాళాలు అందజేస్తూ ప్రభుత్వానికి మద్దతిస్తున్నారు.

donations to telangana cm's relief fund
సీఎం సహాయ నిధికి విరాళాలు

By

Published : Apr 25, 2020, 7:24 PM IST

కరోనాపై పోరాటం చేస్తున్న ప్రభుత్వానికి యావత్​ రాష్ట్రం అండగా నిలుస్తోంది. రాష్ట్ర సర్కార్​కు పలువురు వ్యాపారవేత్తలు, దాతలు, ఉద్యోగులు సాయం చేస్తున్నారు.

  • ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధికి మధుకాన్​ షుగర్​, పవర్​ ఇండస్ట్రీస్​ లిమిటెడ్​ కోటిన్నర రూపాయల విలువైన మాస్కులు, శానిటైజర్లు మంత్రి కేటీఆర్​ ద్వారా అందజేశారు.
  • పోలీస్​ హౌసింగ్​ బోర్డు ఛైర్మన్​ కొల్లేటి దామోదర్​ ఆధ్వర్యంలో హిల్​ లైఫ్​ కేర్​ లిమిటెడ్​ రూ.96 లక్షల విలువైన హై ప్రెజర్​ బ్యాక్​ప్యాక్​ స్ప్రేయర్లను ప్రభుత్వానికి అందించింది.
  • ఈస్ట్​ ఇండియ్​ పెట్రోలియం ప్రై.లి. రూ.73 లక్షల విలువైన మాస్కులు, శానిటైజర్లు అందజేసింది. టీపీఎస్​సీ ఛైర్మన్​ గంటా చక్రపాణి, సభ్యులు రూ.1.25 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు.

ABOUT THE AUTHOR

...view details