తెలంగాణ

telangana

ETV Bharat / city

TTD: భక్తుల పెద్ద మనసు.. తితిదే ట్రస్టుకు రూ.2.17 కోట్ల విరాళాలు - తిరుపతి తాజా సమాచారం

TTD: తితిదే నిర్వహిస్తున్న వివిధ ట్రస్టులకు.. దాతలు రూ. 2.17 కోట్లు  విరాళాలుగా అందించారు. టీవీఎస్‌ సంస్థ ఛైర్మన్‌ సుదర్శన్‌ తితిదే శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయకు రూ. కోటి ఐదు లక్షల విరాళమిచ్చారు.

TTD
TTD

By

Published : Jun 19, 2022, 11:08 AM IST

TTD: తితిదే నిర్వహిస్తున్న వివిధ ట్రస్టులకు.. దాతల ద్వారా భారీగా విరాళాలు వచ్చాయి. శుక్రవారం భక్తులు రూ.2.17 కోట్లు విరాళాలుగా అందించారు. టీవీఎస్‌ సంస్థ ఛైర్మన్‌ సుదర్శన్‌ తితిదే శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయకు రూ.కోటి ఐదు లక్షల విరాళమిచ్చారు. సంబంధిత చెక్కును ఛైర్మన్‌ తరఫున ప్రతినిధులు తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డికి శనివారం అందజేశారు.

తితిదే ట్రస్టులకు శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు చెందిన భక్తులు విరాళాలు సమర్పించారు. జీవీఆర్‌ ఇన్‌ఫ్రా సంస్థ తరఫున తితిదే శ్రీ బాలాజీ ఆరోగ్యవరప్రసాదిని పథకానికి రూ.కోటి 26 వేలు విరాళంగా అందింది. మరో ముగ్గురు భక్తులు రూ.12.5లక్షలు ఇచ్చారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details