హైదరాబాద్ లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్ వద్ద ఉన్న రామయ్యను దర్శించుకోవడానికి వెళ్లిన భక్తులు ఓ ఆశ్చర్య ఘట్టాన్ని తిలకించారు. ఆలయ ధ్వజ స్తంభం చుట్టూ ఈరోజు తెల్లవారుజామున ఓ శునకం ప్రదక్షిణలు చూసి పరవశించిపోయారు.
రామాలయ ధ్వజస్తంభం చుట్టూ శునకం ప్రదక్షిణలు - Dog walking around lord Rama temple in Hyderabad
తెల్లవారుజామునే రామయ్య దర్శనం కోసం గుడికి వెళ్లిన భక్తులు తమ కంటే ముందే రాముల వారి చెంతకు చేరుకున్న ఓ శునకం ధ్వజస్తంభం చుట్టూ శ్రద్ధగా ప్రదక్షిణలు చేయడం చూసి ఆశ్చర్యపోయారు. ఆ అద్భుత ఘట్టాన్ని తమ చరవాణీల్లో బంధించారు.
రామయ్య ఆలయ ధ్వజస్తంభం చుట్టూ శునకం ప్రదక్షిణలు
ఆ అమోఘ ఘట్టాన్ని భక్తులు తమ చరవాణీల్లో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. శునక భక్తికి రామయ్య ఫిదా అవుతాడు, త్రేతా యుగంలో ఉడత భక్తి, కలియుగంలో శునక భక్తి అంటూ నెటిజన్లు కమెంట్లు పెడుతున్నారు.
- ఇదీ చూడండి :కొలనులో కొలువైన.. చదువుల తల్లి!
Last Updated : Jun 14, 2020, 10:51 AM IST