తెలంగాణ

telangana

అతిగా శృంగారంలో పాల్గొంటే ఆయుష్షు క్షీణిస్తుందా?

By

Published : Mar 11, 2022, 9:16 AM IST

సెక్స్​లో పాల్గొనడంపై మహిళలు, పురుషుల్లో కూడా వివిధ రకాల అపోహలు ఉంటాయి. ఆయువు క్షీణత అనేది అందులో ఓ రకం. అతిగా శృంగారంలో పాల్గొంటే ఆయువు క్షీణిస్తుందని భావిస్తుంటారు. మరి దీనిపై నిపుణుల మాటేమిటి?

అతిగా శృంగారంలో పాల్గొంటే ఆయుష్షు క్షీణిస్తుందా?
అతిగా శృంగారంలో పాల్గొంటే ఆయుష్షు క్షీణిస్తుందా?

శృంగారంలో పాల్గొనడం ప్రత్యేక అనుభూతి. కానీ అది ఎక్కువైతే ఆయుష్షు క్షీణిస్తుందనేది చాలా మంది భావన. పురుషులతో పాటు మహిళలలో ఈ సందేహం ఉంది. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది కేవలం అపోహే అని స్పష్టం చేశారు.

నిజానికి సెక్స్​లో ఎక్కువగా పాల్గొనే వారికి ఆరోగ్యం బాగుంటుందని.. ఆయుష్షు ఇంకా పెరుగుతుందని సూచిస్తున్నారు. సెక్స్​లో పాల్గొనేటప్పుడు విడుదలయ్యే ఫీల్​గుడ్​ హార్మోన్సే అందుకు కారణని పేర్కొన్నారు. వీటి వల్ల ఆరోగ్యానికి రక్షణగా నిలిచే ఇమ్యూనిటీ పెరుగుతుందని చెప్పుకొచ్చారు. కాబట్టీ సెక్స్​ అనేది ఆరోగ్యానికి అత్యంత అవసరమైనదని.. దీని వల్ల లాభమే కానీ నష్టం కలగదని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: రోజులో ఎన్ని సార్లు సెక్స్​లో పాల్గొనవచ్చు?

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details