కరోనా దృష్ట్యా.... ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసేందుకు వైద్యుల నియామకాలకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా టిమ్స్, గాంధీ ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్ పద్ధతిన ఈ నియామకాలను చేపట్టనున్నారు. జనరల్ మెడిసిన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు 35, అనస్తీషియా అసిస్టెంట్ ప్రొఫెసర్లు 35, టీబీ అండ్ సీడీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు 15 మందిని నియమించనునట్టు సర్కారు ప్రకటించింది.
కరోనా ఆస్పత్రుల్లో పని చేసేందుకు డాక్టర్లకు ప్రభుత్వ పిలుపు - hyderabad hospitals
కరోనా ఆస్పత్రుల్లో ఏడాది పాటు కాంట్రాక్టు పద్ధతిన పనిచేసేందుకు వైద్యులను నియమించేందుకు ప్రభుత్వ ప్రకటన విడుదల చేసింది. ఆయా విభాగాల్లో కలిపి మొత్తం 85 మంది కోసం ఈ నెల 17 న కోటీలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపింది. నెల జీతం రూ. లక్షా 25 వేలతో పాటు పలు ఇంసెంటివ్స్ని ఇస్తానంది.
doctors recruitment in Hyderabad government hospitals
ఏడాది కాలానికి కాంట్రాక్ట్ పద్ధతిన నియమించనున్న ఆయా విభాగాల వైద్యులకు రూ.లక్షా 25 వేల నెల జీతంతో పాటు ఇతరత్రా ఇన్సెంటివ్స్ ఇవ్వనున్నట్టు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ప్రకటించింది. ఈ నెల 17న కోటి వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో డీఎంఈ ఆడిటోరియంలో ఇంటర్వ్యూ పద్ధతిన నియామకాలు చేపతనున్నట్టు స్పష్టం చేసింది.