వైద్యులపై జరుగుతున్న దాడులను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. హుజురాబాద్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్‌పై కాంగ్రెస్ నాయకుడు కౌశిక్ రెడ్డి దాడి చేయటం సరికాదని... ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ విభాగం ప్రతినిధులు పేర్కొన్నారు. కరోనా ప్రారంభం నుంచి ప్రాణాలకు తెగించి వైద్యులు, వైద్య సిబ్బంది పని చేస్తున్నాయని తెలిపారు. ఈ క్రమంలో పలు సందర్భాల్లో వైద్యులపై దాడులు చేసి తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీస్తుయన్నారు.
'వైద్యులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం' - dgp mahender reddy
తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రతినిధులు డీజీపీ మహేందర్ రెడ్డిని కలిశారు. వైద్యులపై దాడి చేసిన నిందింతులను వెంటనే అరెస్టు చేయాలని డీజీపీని కోరారు. దాడిపై విచారణ జరిపిస్తామని... దోషులుగా తేలిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హామీ ఇచ్చారు.
గాంధీలో దాడి జరిగిన సందర్భంలో అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారని... ఉస్మానియా, నిలోఫర్, కరీంనగర్, హూజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు పలు చోట్ల వైద్యుల మీద దాడులు జరగడం తీవ్రంగా బాధిస్తోందన్నారు. కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు అయిందని... వెంటనే అరెస్టు చేయాలని కోరారు. ఏపీడమిక్ డీసీజెస్ యాక్ట్ 1897 ప్రకారం అతనిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇదే విషయంపై చట్ట ప్రకారం శిక్షించాలని... తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రతినిధులు డీజీపీ మహేందర్ రెడ్డిని కలిశారు. ఈ దాడిపై విచారణ జరిపిస్తామని... దోషులుగా తేలిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హామీ ఇచ్చినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు.