తెలంగాణ

telangana

కొవిడ్​ ఆస్పత్రులపై తనిఖీ, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు

By

Published : Oct 20, 2020, 9:48 PM IST

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్​ ఆస్పత్రుల తనిఖీ, పర్యవేక్షణ కమిటీని నియమించింది. వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి, వైద్య విద్యా సంచాలకుల పర్యవేక్షణలో కమిటీ పనిచేయాల్సి ఉంటుంది.

కొవిడ్​ ఆస్పత్రులపై తనిఖీ, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు
కొవిడ్​ ఆస్పత్రులపై తనిఖీ, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు

కొవిడ్ చికిత్సను అందించే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల తనిఖీ, పర్యవేక్షణ కోసం సర్కారు... నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కమిటీని ఏర్పాటు చేసిన వైద్య, ఆరోగ్యశాఖ... సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్ ఆసుపత్రుల రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ శ్రవణ్ కుమార్ ఛైర్​పర్సన్​గా కమిటీని ఏర్పాటు చేసింది.

ఉస్మానియా వైద్యకళాశాల అసోసియేట్ ప్రొఫెసర్లు సునీల్ కుమార్, పావని, విశాల్, నీలోఫర్ ఆసుపత్రి అసోసియేట్ ప్రొఫెసర్ రవి, ఉస్మానియా వైద్యకళాశాల ప్రొఫెసర్ లక్ష్మణ్ రావు కమిటీలో సభ్యులుగా ఉంటారు. వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి, వైద్య విద్యా సంచాలకుల పర్యవేక్షణలో కమిటీ పనిచేయాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి: అల్పపీడన ప్రభావం... తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

ABOUT THE AUTHOR

...view details