ఏపీకి చెందిన మాజీ ఎంపీ సబ్బం హరి ఆరోగ్యం నిలకడగా ఉందని విశాఖలోని ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని స్పష్టం చేశారు. చికిత్సకు కొంతవరకు సబ్బం హరి స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు. కొవిడ్ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధరణ కావటంతో.. కొన్ని రోజులుగా విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సబ్బంహరి చికిత్స పొందుతున్నారు.
చికిత్సకు స్పందిస్తున్న సబ్బం హరి.. నిలకడగా ఆరోగ్యం - నిలకడగా సబ్బం హరి ఆరోగ్యం వార్తలు
ఏపీకి చెందిన మాజీ ఎంపీ సబ్బం హరి చికిత్సకు స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని స్పష్టం చేశారు.
ప్రస్తుతం నిలకడగా మాజీ ఎంపీ సబ్బం హరి ఆరోగ్యం
ఏప్రిల్ 15న కొవిడ్ నిర్ధరణ కాగా డాక్టర్ల సూచన మేరకు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. బుధవారం ఆసుపత్రికి షిఫ్ట్ అయ్యారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నారు. సబ్బంహరి ఆరోగ్య పరిస్థితిపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరా తీశారు. ఆయన ఆరోగ్యంపై వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చదవండి:భారత్ బంద్: సరిహద్దు జిల్లాలో అప్రమత్తమైన పోలీసులు