తెలంగాణ

telangana

ETV Bharat / city

'నా కుమారుడిని వేరే ఆస్పత్రికి తరలించండి' - వైద్యుడు సుధాకర్ వార్తలు

ఏపీలోని విశాఖపట్టణం మానసిక ఆస్పత్రి నుంచి వైద్యుడు సుధాకర్​ను వేరే ఆస్పత్రికి తరలించాలని ఆయన తల్లి కోరారు. ఏపీ ప్రభుత్వం తమ కుమారుడిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించారు.

SUDHAKAR MOTHERS PRESS MEET
'నా కుమారుడిని వేరే ఆస్పత్రికి తరలించండి'

By

Published : May 29, 2020, 7:42 PM IST

వైద్యుడు సధాకర్​ను విశాఖ మానసిక ఆస్పత్రి నుంచి వెంటనే వేరే ఆస్పత్రికి తరలించాలని ఆయన తల్లి డిమాండ్ చేశారు. మానసిక ఆస్పత్రిలో చికిత్సపై అనుమానం వ్యక్తం చేశారు. చికిత్సపై సుధాకర్​లో భయాందోళన మొదలైందని తెలిపారు. ఆరోగ్యం బాగున్న వ్యక్తిని మానసిక ఆస్పత్రిలో చేర్చటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. 15 రోజులుగా ఇబ్బంది పెడుతున్నారంటూ సుధాకర్ లేఖ రాశారని... మందుల వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పినట్లు వెల్లడించారు.

'నా కుమారుడిని వేరే ఆస్పత్రికి తరలించండి'

'ఈ ప్రభుత్వం కళ్లు మూసుకుంది. వైద్యుడిపై ఇంత కక్ష సాధింపా..? తల్లిగా నా బాధను ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. డాక్టర్ రామిరెడ్డికి, నా కుమారుడికి వాగ్వాదం జరిగింది. వైద్యుడు రామిరెడ్డి ఏవేవో మందులిచ్చి ఇబ్బంది పెడుతున్నారు. విశాఖ మానసిక ఆస్పత్రిలో నా కుమారుడికి ప్రాణహాని ఉంది. చికిత్సపై సుధాకర్ భయాందోళన వ్యక్తం చేశారు. నా కుమారుడికి వేరే ఆస్పత్రిలో చికిత్స చేయించాలి '

ABOUT THE AUTHOR

...view details