తెలంగాణ

telangana

ETV Bharat / city

మానసిక రోగికి ఇచ్చే మందులు ఇస్తున్నారు: డాక్టర్ సుధాకర్​ - vishaka doctor sudhakar letter news

ఆయన ఒక డాక్టర్​.. ఇప్పుడు పరిస్థితులు తలకిందులయ్యాయి. ఏవేవో కారణాలతో అతడి జీవితమే చిన్నాభిన్నమైంది. డాక్టర్ సుధాకర్ జీవితంలో ఎన్​-95 మాస్కుల వివాదం నుంచీ.. ఇప్పుడు తనకు మానసిక ఆస్పత్రిలో ఇస్తున్న మందులతో వస్తున్న .. దుష్ప్రభావాలపై మొరపెట్టుకున్నారు.

sudhakar fresh
మానసిక రోగికి ఇచ్చే మందులు ఇస్తున్నారు: డాక్టర్ సుధాకర్​

By

Published : May 27, 2020, 4:27 PM IST

మాస్కుల వివాదం నుంచి అన్ని విషయాలు వివరిస్తూ ఆంధ్రప్రదేశ్​లోని విశాఖజిల్లా సూపరింటెండెంట్​కు డాక్టర్ సుధాకర్ లేఖ రాశారు. సాధారణంగా ఉన్న తనకు మానసిక రోగికి ఇచ్చే మందులు ఇస్తున్నారని వెల్లడించారు. తనకు ఏ రోజు ఏ మందులు ఇచ్చారో లేఖలో ప్రస్తావించారు. ఆ మందుల వల్ల దుష్ప్రభావాలు వస్తున్నాయని లేఖలో వెల్లడించారు. పెదవిపై వచ్చిన మార్పులు చూపిస్తూ ఫొటోలను డాక్టర్ సుధాకర్ విడుదల చేశారు. తనను వెంటనే మరో ఆస్పత్రికి రిఫర్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. తన మానసిక స్థితి సరిగానే ఉందని లేఖలో సుధాకర్ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details