ప్ర. అమెరికాలో తాజా పరిస్థితులు ఎలా ఉన్నాయి. వైరస్ వ్యాప్తి ఏమైనా అందుబాటులోకి వచ్చిందా?
జ. న్యూయర్క్, న్యూజెర్సీలో మార్చి నెలలో విపరీతంగా కొవిడ్ వైరస్ వ్యాప్తి చెందింది. కానీ ప్రస్తుతం ఆ స్థాయిలో వ్యాప్తి లేదు. కాస్త అదుపులోనే ఉన్నప్పటికీ... దేశ వ్యాప్తంగా మాత్రం ఆందోళనకరమైన పరిస్థితే కనిపిస్తోంది.
ప్ర. కరోనా వ్యాప్తి ప్రారంభమైన ఈ 6 నెలల కాలంలో వైద్యులకు వైరస్‌పై ఏ మేరకు అవగాహన ఏర్పడింది.?
జ. పరిశోధనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. దీన్ని ఎలా తగ్గించాలి, ఏ విధంగా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది, ఏ విధంగా దీన్ని నివారించవచ్చు అనే విషయాలపై వివిధ రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ప్ర. మీరు పనిచేసే న్యూజెర్సీలోని ఆసుపత్రిలో కరోనా రోగులకు అందిస్తున్న చికిత్సా విధానాలేంటి? వాటి ఫలితాలు ఎలా ఉన్నాయి?
జ. రోగుల్లో రక్తం గడ్డ కట్టే పరిస్థితులు చాలా వరకు గమనిస్తున్నాం. ఈ వైరస్ ధాటికి ఊపిరితిత్తులు చెడిపోతున్నాయి. అందువల్ల వారు వెంటిలేటర్‌పై చికిత్స పొందాల్సిన అవసరం ఏర్పడుతుంది. వారికి రక్తం పలుచబడే మాత్రలు వాడుతూ... నిరంతర పర్యవేక్షణలో ఉంచుతున్నాం. వారు డిశ్ఛార్జ్ అయ్యి ఇంటికి వెళ్లిపోయినప్పటికీ ఈ బ్లడ్ థిన్నింగ్ మాత్రలు వాడేలా సూచనలు చేస్తున్నాం. ఇటివలీ కాలంలో వచ్చిన డెక్సామిథజోన్ అనే స్టెరాయిడ్‌ను వాడితే... వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులను వెంటిలేటర్‌కు తీసుకెళ్లే అవసరం రాకుండానే చికిత్స చెయొచ్చని తెలుస్తోంది. రెమిడెసివర్ వల్ల వ్యాధి జీవిత కాలం తగ్గిపోతున్న విషయం గమనిస్తున్నాం. ప్లాస్మా మార్పిడి అనేది ఇంకా పరిశోధన స్థాయిలోనే ఉంది.
ప్ర. మీరు చెప్పిన రెండు రకాల యాంటీ వైరల్ డ్రగ్స్ ఫలితాలను ఇస్తున్నాయా?
జ. ఫలితాలను ఇస్తున్నాయి, కానీ ఇది పూర్తి చికిత్స మాత్రం కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో రోగులకు చికిత్స అందించే ప్రతీ అవకాశాన్ని వాడుకుంటున్నాం. వీటివల్ల రోగులు కాస్త త్వరగా కోలుకుంటున్నారు. మరో 6 నెలలు, ఏడాదిలో పూర్తిస్థాయి ఔషధాలు అందుబాటులోకి వస్తాయని నమ్ముతున్నాం.
ప్ర. ఫావిపిరాఫిర్ అనే ఔషధం త్వరలో ఇండియాలో కూడా అందుబాటులోకి రానుంది. అమెరికాలో దీని వాడకం ఇదివరకే మెదలుపెట్టారు. దీని ఫలితాలు ఎలా ఉన్నాయి?
జ. మూడో దశ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ దశ పరీక్షలు పూర్తి అయిన తరువాత దీన్ని వాడొచ్చు. వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న రోగులకు వాడే అవకాశం ఉంటుంది. మూడో దశ పరీక్షలు పూర్తయ్యే వరకు... దీనిపై ఓ అంచనాకు రాలేం.
ప్ర. ఫావిపిరాఫిర్, రెమిడెసివర్, యాంటీ కోయాగ్యులేషన్లను ఏ విధంగా, ఏ మోతాదులో వినియోగిస్తారు?
జ. వైరస్ లక్షణాలు తక్కువగా ఉన్న వారికి తొలిదశలో ఫావిపిరాఫిర్ 15 రోజుల వరకు ఇస్తారు. మధ్యస్థాయిలో లక్షణాలు ఉన్న వారికి రెమిడెసివర్ అందిస్తారు. రోగి ఆసుపత్రిలో చేరగానే ముందుగా 200 మి.గ్రా. డోసు ఇస్తారు. తరువాత నాలుగు రోజులపాటు 100 మి.గ్రా. చొప్పున మొత్తం 5 రోజుల పాటు అందిస్తారు. యాంటీ కోయాగ్యులేషన్ అనేది ప్రారంభ దశ నుంచి వాడుతాము. బ్లడ్ థిన్నింగ్ ఔషధాలలోని ఎపిక్సాపాన్, రివరాక్సాపాన్ అనే మాత్రలను దీనిలో వాడవచ్చ. ఇండియాలో వార్ఫిరన్ అనేది కూడా ఈ రకానికి సంబంధించినదే.
ప్ర. యాంటీ వైరల్ డ్రగ్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత అమెరికాలో మరణాల రేటు ఏ విధంగా ఉంది?
జ. ఈ చికిత్సలో రోగికి వెంటిలేటర్ అవసరం రాకపోవడమే మనం సాధించే ప్రథమ విజయం. ఈ వైరస్ ప్రధానంగా దెబ్బతీసేది శ్వాసవ్యవస్థనే. ఈ డ్రగ్స్ అందుబాటులోకి వచ్చాక వైరస్ మరణాల రేటు క్రమంగా తగ్గుతుంది. పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయి. మరో 3 నుంచి 6 నెలల్లో పూర్తి సమాచారం రావొచ్చు.
ప్ర. కరోనా సోకిన కార్డియాక్ రోగులు ఎంతవరకు కోలుకుంటున్నారు? గుండె వైద్య నిపుణులుగా మీరు గమనించిన అంశాలేమిటి?