కాపర్ బ్రాండ్ ఉత్పత్తుల తయారీలో పేరొందిన ఎంఎస్ఆర్ ఇండియా.. మాస్కుల ఉత్పత్తి ప్రారంభించింది. ఐదు లేయర్ల స్వచ్ఛమైన రాగితో తయారు చేసిన కాపర్ మాస్కులను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్ వేదికయింది. కాపర్ మాస్క్‌తో పాటు కాపర్ కేర్ కీని విడుదల చేస్తున్నట్లు సీఈఓ మల్లారెడ్డి తెలిపారు.
మార్కెట్లో కాపర్ ఫిల్టర్ ఎన్-95 మాస్కులు విడుదల - Doctor copper brand's company MSR India into masks manufacture
కాపర్ బ్రాండ్ ఉత్పత్తుల తయారీలో పేరొందిన ఎంఎస్ ఆర్ ఇండియా.. తిరిగి ఉపయోగించగలిగే కాపర్ ఫిల్టర్ ఎన్-95 మాస్కులను మార్కెట్లోకి విడుదల చేసింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో.. కాపర్ మాస్క్‌తో పాటు.. కాపర్ కేర్ కీ విడుదల చేస్తున్నట్లు కంపెనీ సీఈవో ఎం. మల్లారెడ్డి ప్రకటించారు.
మార్కెట్లో కాపర్ ఫిల్టర్ ఎన్-95 మాస్కులు విడుదల
కాపర్ కీ కొత్త ఉపరితలాలను నేరుగా చేతితో తాకకుండా రక్షణ కల్పిస్తుందని చెప్పారు. కోవిడ్ - 19 నుంచి రెట్టింపు రక్షణ తమ మాస్కుతో సాధ్యమని వెల్లడించారు. ఒక్కో మాస్కు 199 రూపాయలకు లభిస్తుందని.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు.. అన్ని ప్రముఖ సూపర్ మార్కెట్లు, రిటైల్ ఔట్ లెట్లలో ఇవి లభ్యమవుతాయని కంపెనీ సీఈవో పేర్కొన్నారు.