తెలంగాణ

telangana

ETV Bharat / city

బస్తీల్లో సఫాయికి సుస్తీ.. చీపురు పట్టిన కార్పొరేటర్ డాక్టర్ - corporator surekha conducted swacch bharat

డాక్టర్​ కాస్తా... కార్పొరేటర్​ అయ్యింది. నాడి చూసి శరీరంలోని రోగాలు నయం చేసిన వైద్యురాలు... ఇప్పుడు బస్తీల్లో పేరుకుపోయిన సమస్యలను తీర్చేందుకు సిద్ధమైంది. కార్పొరేటర్​గా గెలవటమే తరువాయి... తన పని మొదలుపెట్టింది. స్టెతస్కోప్​ పట్టుకున్న చేతులతోనే చీపురు పట్టి గల్లీల్లో చెత్తను శుభ్రచేసేందుకు నడుంబిగించింది.

డాక్టరమ్మ కార్పొరేటర్​ అయ్యింది... గల్లీ ఊడ్చేసింది...
డాక్టరమ్మ కార్పొరేటర్​ అయ్యింది... గల్లీ ఊడ్చేసింది...

By

Published : Dec 6, 2020, 4:20 PM IST

డాక్టరమ్మ కార్పొరేటర్​ అయ్యింది... గల్లీ ఊడ్చేసింది...

మొన్నటి వరకు స్టెతస్కోప్ వేసుకొని రోగులను చికిత్స అందించిన వైద్యురాలు... నేడు కార్పొరేటర్​గా గెలిచి బస్తీల్లో చెత్తను శుభ్రం చేశారు. బల్దియా ఎన్నికల్లో గన్​ఫౌండ్రి డివిజన్ నుంచి భాజపా కార్పొరేటర్​గా ఎన్నికైన డా.సురేఖ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డా. బీఆర్ అంబేడ్కర్ 64వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ అబిడ్స్ చిరాగ్​గల్లీలైన్​లోని నేతాజీనగర్​ బస్తీలో ఉన్న ఆయన విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.

నివాళులర్పించే సమయంలో... అంబేడ్కర్ విగ్రహం పక్కనే చెత్త పేరుకుపోయి ఉండటం గ్రహించిన కార్పొరేటర్ సురేఖ... అధికారులకు ఫోన్​లో విషయం తెలిపారు. ఎంతసేపటికీ స్పందన రాకపోవడం వల్ల కార్పొరేటరే రంగంలోకి దిగారు. చీపురు పట్టి శుభ్రం చేసి... పారపట్టి చెత్తను ఎత్తారు. బస్తీ ప్రజలు ఎవరు అక్కడ చెత్త వేయొద్దని... చెత్తకుండీల్లోనే వేయాలని సురేఖ సూచించారు.

ఇదీ చూడండి: అంబేడ్కర్ ఆశయాలను కొనసాగించాలి: కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details