మేషం
వారం తొలి రోజు బద్ధకంగా, ఉత్సాహం లేనట్టుగా మీకనిపిస్తుంది. ఈ వారం ప్రారంభంలో మీరు మీ కుటుంబంపై దృష్టి సారించాలి. కుటుంబ వేడుకలకు మీరు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రేమించే వ్యక్తితో మీ సాన్నిహిత్యం వారం మధ్యలో పెరుగుతుంది. మీరు కొత్త సంబంధం ప్రారంభించే సూచనలూ కనిపిస్తున్నాయి. మీరు మీ జీవితభాగస్వామి దూకుడు తత్వాన్ని భరించాల్సి ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలకు ఈ సమయం అనుకూలంగా ఉంది. అయితే మీరు దూకుడుగా నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. విద్యార్థులు చదువులపై దృష్టి సారిస్తారు. వారం చివరలో వృత్తిపరంగా మీకు క్లిష్టపరిస్థితి ఏర్పడవచ్చు. ప్రభుత్వం లేదా న్యాయపరమైన పనుల్లోనూ ఆటంకాలు ఏర్పడతాయి. మీ ఖ్యాతిని నిలబెట్టుకోవడంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరంగా వారం చివరి రోజుల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి.
వృషభం...
గొప్ప ఉత్సాహంతో మీరు వృత్తిజీవితంలో ముందుకు సాగుతారు. ఈ సమయంలో మీరు కొత్తది ఏమైనా మొదలుపెడతారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే సూచనలున్నాయి. వారం మధ్యలో మీ కుటుంబ జీవితం అద్భుతంగా ఉంటుంది. అవివాహితులు వివాహం చేసుకోవాలనుకుంటారు. వారం చివరి రెండు రోజులు మీ సంబంధాల్లో కొన్ని సమస్యలు ఏర్పడతాయి. ప్రస్తుత స్నేహితులు మీకు దీర్ఘకాలంలో లాభదాయకంగా ఉంటారు. ఊహించని ఆర్థిక ప్రయోజనాలు అందుకుంటారు. ఆర్థికవ్యవహారాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాం. ఖర్చులను నియంత్రించుకోలేకపోతే మీరు సమస్యల్లో చిక్కుకుంటారు. వారం ప్రారంభం నుంచి కూడా విద్యార్థుల తమ చదువులపై ఏకాగ్రత చూపుతారు. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈ వారంలో యాక్సిడెంట్ అయ్యే సూచనలు చాలా అధికంగా ఉన్నాయి.
మిథునం...
ఈ వారం ప్రారంభంలో మీరు కొంత అలసటగా ఉంటారు. కొన్ని ఖర్చులు కూడా భరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నుంచి పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రేమ, సంబంధాల విషయంలో ఈ వారం అద్భుతంగా ఉంది. అయితే మీరు మీ దూకుడును నియంత్రణలో ఉంచుకోవాలి. ఉద్యోగంలో మీరు విజయం, పేరు సంపాదించుకుంటారు. మీ కుటుంబ జీవితం హాయిగా ఉంటుంది. మీరు ఆనందంగా, సంతోషంగా ఉంటారు. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీ వృత్తి జీవితం కూడా సరైన మార్గంలోకి వస్తుంది. ఇది మీలో సంతోషాన్ని, సానుకూలతను తీసుకువస్తుంది. మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో కొంత ఉపశమనం లభిస్తుంది. జీవితాన్ని ఆనందమయం చేసుకునేందుకు మీరు ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రేమించే వ్యక్తికి ప్రేమను ఎలా వ్యక్తం చేయాలో మీరు నేర్చుకోవడం మంచిది. వారిని సంతోషంగా ఉంచడం ప్రాధాన్యతగా పెట్టుకోండి.
కర్కాటకం...
ప్రతికూల ఆలోచనలు సానుకూల ఫలితాలు తీసుకురావనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవడం మంచిది. కాబట్టి మీరు సానుకూల ధోరణితో ఉంటూ కష్టపడాలి. ఈ వారం తొలిరోజు సాయంత్రం నుంచి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రెండో రోజు నుంచి మీకు తోటి ఉద్యోగుల నుంచి చక్కని సహకారం లభిస్తుంది. మీ పనితీరు మీ ఉన్నతాధికారులను ఆకట్టుకుంటుంది. మీ కుటుంబజీవితం ప్రశాంతంగా, ప్రేమపూర్వకంగా ఉంటుంది. కుటుంబంతో కలిసి మీరు విహారయాత్ర కూడా చేస్తారు. మీరు వ్యాపారంలో ఉంటే అందులోనూ చక్కని పురోగతి చూస్తారు. మిమ్మల్ని పడదోసేందుకు మీ పోటీదారులు చేసే ప్రయత్నాలు ఫలించవు. ఆరోగ్యం కూడా మీకు సహకరిస్తుంది. మీరు మీ సంతోషం గురించి ఆలోచిస్తారు. ఈ వారం విద్యార్థులు చక్కగా చదువుకుంటారు. వారికి నచ్చిన విషయాల్లో ఆసక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు ఈ సమయంలో మిమ్మల్ని బాధించవచ్చు. మేధోపరమైన చర్చల్లో మీరు సమయాన్ని గడుపుతారు.
సింహం
ఉద్యోగంలో మీరు ప్రమోషన్ అందుకునే అవకాశాలు ఈ సమయంలో చాలా అధికంగా ఉన్నాయి. ఈ వారం ద్వితీయార్థంలో మీ సృజనాత్మకత కొత్తశిఖరాలకు చేరుతుంది. మీ వైవాహిక జీవితంగా మధురంగా ఉంటుంది. ఈ వారంలో 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మీలో విశ్రాంతిలేమి చోటుచేసుకుంటుంది. ఇది మినహా వారమంతా మీరు చక్కగా గడుపుతారు. బంధువులు, స్నేహితులు కొందరు విషయనిపుణులు లేదా సీనియర్లతో మీ అనుబంధం అద్భుతంగా ఉంటుంది. అది మీకు దీర్ఘకాలంలో మేలు చేస్తుంది. మీ ప్రేమ, సంబంధం నిదానంగా ముందుకుసాగుతాయి. ప్రతీ అందమైన విషయానికి సమయంపడుతుందని, సహనంగా, నిబద్ధతతో వ్యవహరించుకువాలని గుర్తుంచుకోవాలి. ఆశించిన ఫలితాలు పొందేందుకు విద్యార్థులు మరింత శ్రమించాల్సి ఉంటుంది. ఇతర వ్యవహారాల నుంచి వారు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యపరంగా ఈ వారం ద్వితీయార్థం మీకు అనుకూలంగా ఉంది.
కన్య...
వారం ప్రారంభంలో బోనస్, వేతన పెంపు, ప్రమోషన్ లేదా బదిలీ రూపంలో ఆర్థిక ప్రయోజనాన్ని అందుకుంటారు. వ్యాపారులకు కొత్త క్లైంట్లు దొరుకుతారు, ఆదాయంలోనూ వృద్ధి చోటుచేసుకుంటుంది. వ్యాపార ప్రణాళిక రూపకల్పనలో మీరు సమయం వెచ్చిస్తారు. మీ కుటుంబ జీవితం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. శత్రువులపై మీరు విజయం సాధిస్తారు. నవంబర్ 20, 21 తేదీల్లో ఆరోగ్యపరంగా మీకు సమస్యలు తలెత్తవచ్చు. ఈ సమయంలో ఎటువంటి ఘర్షణలకు దిగకండి. ఈ సమయంలో ప్రయాణాలు చేయకపోవడం మంచిది లేనిపక్షంలో కొన్ని తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ వారం ద్వితీయార్థం మీకు అనుకూలంగా ఉంది. కొత్త శక్తి వచ్చినట్టు మీకనిపిస్తుంది. వృత్తిజీవితంలో విజయాలు సాధించేందుకు, ముందుకు వెళ్లేందుకు మీ ప్రభావవంతమైన, ఆకట్టుకునే సంభాషణ నైపుణ్యం మీకు సాయపడుతుంది.
తుల...
మీరు వ్యాపారి అయితే ఈ వారంలో మీరు ఆదాయంలో పెరుగుదలను చూడవచ్చు. స్నేహితులను కలుసుకుంటారు వారి నుంచి కొంత ప్రయోజనం పొందుతారు. మీ భార్య, సంతానం నుంచి శుభవార్త వింటారు. వివాహ ప్రయత్నాల్లో ఉన్నట్టైతే మీకు తగిన జీవిత భాగస్వామి దొరుకుతారు. సంభాషణ నైపుణ్యంతో మీరు ఇతరులను ఆకట్టుకుంటారు. అయితే మీరు అహంభావిగా కనిపించకుండా జాగ్రత్తగా వ్యవహరించండి. మీ దూకుడును నియంత్రణలో పెట్టుకోండి, ఎటువంటి పరిస్థితినైనా ప్రశాంతంగా ఎదుర్కొండి. ఈ వారంలో చివరి రెండు రోజులు మినహా మిగిలిన రోజుల్లో ఆరోగ్యం మీకు సహకరిస్తుంది. ఈ వారం చివరి రెండు రోజులు మీ ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. చదువులపై ఏకాగ్రత చూపేందుకు వారం ప్రథమార్థం విద్యార్థులకు బాగా అనుకూలంగా ఉంది.
వృశ్చికం...
ఈ సమయంలో మీరు చాలా వేడుకలకు హాజరవుతారు. వృత్తి జీవితంలోనూ మీరు తీరిక లేకుండా ఉంటారు. మీ వైవాహిక, కుటుంబ జీవితం హాయిగా ఉంటుంది. స్టాక్ మార్కెట్ నుంచి మీరు లబ్దిపొందే సూచనలున్నాయి. కుటుంబం కోసం మీరు బంగారం, వెండి, దుస్తులు లేదా అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. కెరీర్‌కు సంబంధించి మీ సంతానం నుంచి మీరు శుభవార్త వింటారు. దూకుడుగా ఉండకండి, గాయాలపాలయ్యే సూచనలున్నాయి. వృత్తిపరంగా మీరు జరిపే సంభాషణల్లో జాగ్రత్తగా ఉండండి. మీ ఆర్థికపరిస్థితి పటిష్టంగా ఉంటుంది. ఈ సమయంలో మీలో ఆధాత్మిక భావనలు ఉంటాయి. చదువులపై విద్యార్థులు బాగా శ్రద్ధచూపుతారు. ముక్కు, చెవి, గొంతుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే ఈ వారంలో మీరు జాగ్రత్తగా ఉండాలి.
ధనుస్సు...
ఈ వారం ప్రథమార్థంలో మీకు మీ ప్రేమ, సంబంధాల విషయంలో ఆసక్తి సన్నగిల్లుతుంది. బద్ధకం ఆవరించడం వల్ల మీ రోజువారీ పనులు, వృత్తిలో కొంత ఆటంకం కలుగుతుంది. ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండేందుకు మీరు ధ్యానం లేదా కొన్ని వినోద కార్యక్రమాల్లో పాల్గొంటే బాగుంటుంది. వారం ద్వితీయార్థంలో మీ స్నేహితులకు మీకు అండ అవసరమవుతుంది. జీవితభాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది. అయితే మీరు మీ సంబంధం విషయంలో పారదర్శకంగా ఉంటూ వారికి కూడా తగిన చోటు కల్పించండి. మీ జీవితాన్ని పూర్తిగా ఆనందిస్తారు. ఈ వారం ద్వితీయార్థంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలనే ఆసక్తిలో మీలో బాగా పెరుగుతుంది. జీవిస్తున్న తీరు మెరుగుపరుచుకునేందుకు మీరు ప్రయత్నిస్తారు. ఈ వారం చివరి దశలో విద్యార్థులు బాగా శ్రమించాల్సి ఉంటుంది. ఈ వారంలో మీలో ఆధ్యాత్మిక భావాలు ఎక్కువుంటాయి, సమాజ సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కువ సమయం గడుపుతారు.
మకరం...
ఈ వారం మీరు మీ జీవితాన్ని అద్భుతంగా ఆనందిస్తారు. వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారికి తగిన జీవితభాగస్వామి లభిస్తారు. సమాజంలో మీ ఖ్యాతి పెరుగుతుంది. సామాజికంగా మీరు మరింత చురుగ్గా ఉంటారు, కొన్ని సామాజిక బాధ్యతలు కూడా చేపడతారు. మీ శారీరక, మానసిక ఆరోగ్యం మీకు సహకరిస్తుంది. అయితే 20, 21వ తేదీల్లో కొంత విశ్రాంతిలేమి, బలహీనత, ఉదర సంబంధిత సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. బంధువులు లేదా తోటి ఉద్యోగుల నుంచి మీరు బహుమతులు అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ వ్యాపారం కొత్త విజయశిఖరాలను తాకుతుంది. ఉద్యోగులు తమ విధుల్లో చక్కని పనితీరు కనబరుస్తారు. కుటుంబసభ్యుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. విద్యార్థులు ఒడిదొడుకులు ఎదుర్కొంటారు కాబట్టి వారు చదువులపై పూర్తి ఏకాగ్రత చూపాలి. వారం మధ్యలో మీకు అతీతశక్తులపై ఆసక్తి పెరుగుతుంది.
కుంభం...
మీ ప్రేమ, వైవాహిక జీవితం ఈ వారం అద్భుతంగా ఉంటుంది. ఏవైనా అపోహలుంటే అవి తొలగిపోతాయి. వృత్తిజీవితంలోనూ మీరు విజయాలు చూస్తారు. మీ కుటుంబజీవితం ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఉత్సాహం, ఉల్లాసంగా ఉన్నా, పనులు పూర్తి చేసే విషయంలో కొంత విసుగుకు లోనవుతారు. కాలానుగతంగా వచ్చే వ్యాధులు, నిద్రలేమి, బద్ధకం వంటివి ఈ సమయంలో మిమ్మల్ని ఆవరిస్తాయి. మీ కుటుంబం కోసం లేదా మీ పిల్లల చదువు కోసం మీరు డబ్బు ఖర్చు చేస్తారు. చదువులపై విద్యార్థులకు ఆసక్తి సన్నగిల్లుతుంది. ఉద్యోగులకు ఈ వారం సానుకూలంగా ఉంటుంది. విదేశాలకు సంబంధించిన పనుల్లో మీరు విజయాన్ని అందుకుంటారు. సంభాషణా నైపుణ్యం కారణంగా మీరు పైచేయి సాధిస్తారు. వృత్తిపరంగా మీరు సాధించే విజయాలకు సమాజం నుంచి కూడా ప్రశంసలు లభిస్తాయి. మీ ఆర్థికపరిస్థితి చక్కగా ఉంటుంది, మీ కోసం మీరు ఖర్చు పెట్టుకుంటారు. అలాగే సమాజ సంక్షేమ కార్యక్రమాలపై కూడా డబ్బు వెచ్చిస్తారు.
మీనం
ఉద్యోగులు ఈ వారం ప్రశంసలు పొందుతారు, అయితే ప్రయోజనాలు పొందేందుకు కొంత ఓపిగ్గా ఉండాలి. మీ పనులు నిదానంగా అయినప్పటికీ స్థిరంగా ముందుకు కదులుతుంటాయి. మీ పని లేదా వృత్తిని మార్చుకోవాలనే భావన మీలో కలుగుతుంది, ఆ విషయంలో మీకు సాయం అవసరమైతే నిపుణులను సంప్రదించడంలో సంకోచించకూడదు. మెషీనరీ, ఆటోమోటివ్, వ్యవసాయరంగంలోని వారి ఆర్థిక ప్రగతి నిదానిస్తుంది. మీ కుటుంబసభ్యుల కోసం మీరు ఖర్చు చేస్తారు, కాని దానికి ప్రతిగా మీరు గుర్తింపును ఆశించకూడదు. వారం మధ్యలో మీకు ఆర్థికపరంగా మీరు కొన్ని ప్రయోజనాలు అందుకుంటారు. ఆరోగ్యపరంగా పెద్దగా సమస్యలు లేకున్నా జలుబు, దగ్గు, జ్వరం వంటివి మిమ్మల్ని బాధించవచ్చు. మీ భావోద్వేగ, సున్నితతత్వాన్ని కొందరు తమ ప్రయోజనాల కోసం వాడుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి, వాస్తవాన్ని గ్రహించి తార్కికంగా, ఆచరణాత్మకంగా ఆలోచన చేసి మీకే ప్రాధాన్యత ఇచ్చుకోవాలి.
ఇవీ చూడండి : కార్తిక దీపాల వెలుగుల్లో మహిళలు