రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు వేల కోట్ల రూపాయలు రుణంగా తీసుకుంది. బాండ్ల విక్రయంతో ఈ మేరకు నిధులను సమీకరించుకుంది. 13 ఏళ్ల కాలానికి రాష్ట్ర ప్రభుత్వం 2,000 కోట్ల రూపాయల విలువైన బాండ్లను గత శుక్రవారం జారీ చేసింది. రిజర్వ్ బ్యాంకు వాటిని నిన్న వేలం వేసింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు ఎంతో తెలుసా? - telangana debts news
ఈ ఆర్థిక సంవత్సరంలో 47,500 కోట్ల రూపాయలను రుణంగా తీసుకోవాలని బడ్జెట్లో పొందుపరిచిన ప్రభుత్వం.. తాజాగా మరో రెండు వేల కోట్ల రూపాయలు రుణంగా తీసుకొంది. గత వారమే బాండ్ల విక్రయం ద్వారా 1,500 కోట్ల రూపాయలను ప్రభుత్వం సమకూర్చుకొంది.
telangana government loans
గత వారం బాండ్ల విక్రయం ద్వారా 1,500 కోట్ల రూపాయలను సమకూర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం... తాజాగా మరో రూ.2,000 కోట్లను సమీకరించుకుంది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బాండ్ల జారీతో 20 వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రుణం తీసుకొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 47,500 కోట్ల రూపాయలను రుణంగా తీసుకోవాలని ప్రభుత్వం బడ్జెట్లో పొందుపరిచింది. అందులో ఇప్పటి వరకు 20 వేల కోట్లు తీసుకొంది.