కరోనా ఎంతోమంది జీవితాలను అతలాకుతలం చేస్తోంది. కొవిడ్ భయంతో అనేకమంది మందులు, వైద్యపరికరాలు కొని... ఇంట్లో సిద్ధంగా ఉంచుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఇటీవల అక్సీమీటర్ యాప్ గురించి ప్రచారం జరుగుతోంది. ఆ విషయాన్ని సైబర్ నేరగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు.
ఫ్రింగర్ ప్రింట్స్ నుంచి..
ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోగానే మన మొబైల్‌లో పలు అనుమతులు అడుగుతుంది. ఆ తర్వాత యాప్ ఇన్‌స్టాల్ అవుతుంది. ఈ యాప్ ద్వారా మన ఆక్సిజన్ లెవల్‌ను తెలుసుకోవాలంటే..... మన వేలి ముద్రను కొంత సమయంపాటు.. ఫింగర్ ప్రింట్ డిటెక్టర్‌పై ఉంచాల్సి ఉంటుంది. ఇదే సమయంలో సైబర్ నేరగాళ్లు మన వేలి ముద్రల డేటా చోరీ చేస్తారు. మన బ్యాంకు ఖాతాలకు, ఆధార్ కార్డుల వివరాలు... జత అయి ఉంటాయి. మన చరవాణి నుంచి చోరీ చేసిన వేలి ముద్రలతో....వాటి ద్వారా ఖాతాల్లోని నగదు ఖాళీ చేస్తున్నట్లు సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు.