'మరో పది రోజుల్లో అందుబాటులోకి రెండువేల పడకలు' - Dme Ramesh Reddy interview
రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో... వైరస్ సోకిన వారు పడకలు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ప్రభుత్వ , ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ బెడ్ల కొరత వేధిస్తూనే ఉంది. ప్రైవేట్‌లో అయితే ఏకంగా లక్షలు వెచ్చించి ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకల పెంపునకు సంబంధించి తీసుకుంటున్న చర్యలపై డీఎంఈ రమేశ్ రెడ్డితో ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య ముఖాముఖీ.

"హైదరాబాద్‌లో కొవిడ్ రోగుల కోసం మరిన్నీ పడకలు సిద్ధమవుతున్నాయి. మరో పది రోజుల్లో రెండువేల పడకలు అందుబాటులోకి రానున్నాయి. కరోనా కేసుల్లో స్థిరత్వం కొనసాగుతోంది. ప్రైవేట్‌లో ఫీజులు ఎక్కువ వసూలు చేస్తే మాదృష్టికి తీసుకురండి. ప్రైవేట్ ఆస్పత్రులు ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం. చిన్న పిల్లల్లో కోవిడ్ తీవ్రత తక్కువగానే ఉంది. చిన్న పిల్లల ద్వారా ఇంట్లో వారికి కొవిడ్ సోకే అవకాశాలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. పిల్లలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. టీకా రెండో డోస్ తీసుకోవటంలో ఒకట్రెండు వారాలు ఆలస్యమైనా ముప్పేమీ లేదు."- వైద్య విద్య సంచాలకులు రమేష్ రెడ్డి