తెలంగాణ

telangana

ETV Bharat / city

DK aruna: వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే.. కేటీఆర్​ ఆరోపణలు - కేటీఆర్​ వ్యాఖ్యలు

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే.. మంత్రి కేటీఆర్(Minister ktr)​ కేంద్రంపై అభాండాలు వేస్తున్నారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ(DK aruna) ఆవేదన వ్యక్తం చేశారు. టీకా ప్రక్రియలో కేంద్రం విఫలమైందంటూ మంత్రి కేటీఆర్(Minister ktr)​ చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా స్పందించారు. కరోనా సమయంలో ప్రైవేటు ఆస్పత్రుల బిల్లులతో ఇబ్బందులు పడ్డ పేదలను తెరాస ప్రభుత్వం ఆదుకోలేక పోయిుందని విమర్శించారు. రాష్ట్రంలో ఓ వైపు వర్షాలు ప్రారంభమైనా.. ధాన్యం కొనుగోళ్లు ఇంకా పూర్తి చేయలేదని ఆమె మండిపడ్డారు.

dk aruna comments on KTR
DK aruna: వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే.. కేటీఆర్​ వ్యాఖ్యలు

By

Published : Jun 7, 2021, 4:43 PM IST

టీకా ప్రక్రియలో కేంద్రం విఫలమైందంటూ మంత్రి కేటీఆర్(Minister ktr)​ చేసిన వ్యాఖ్యలపై భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ(DK aruna) మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంపై అభాండాలు వేస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు. ట్విట్టర్ వేదికగా కేటీఆర్ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని అన్నారు. హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్‌ను సందర్శించి ఏనాడైన ఉత్పత్తిపై ఆరా తీశారా అని డీకే అరుణ(DK aruna) ప్రశ్నించారు.

టీకాపై ప్రజలకు అవగాహన కల్పించాల్సింది పోయి… రాష్ట్ర సర్కారు దుష్ప్రచారం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు ఆస్పత్రుల బిల్లులతో ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలను తెరాస ప్రభుత్వం అండగా ఉండలేకపోయిందని విమర్శించారు. కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్ కోసం రెండున్నర వేల కోట్లు ఖర్చు చేస్తామన్న సీఎం కేసీఆర్(CM KCR) ప్రభుత్వం… ఎక్కడా రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఆమె ఎద్దేవా చేశారు. ఓ వైపు వర్షాలు ప్రారంభమైనా… ఇంకా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయలేదని… రైతుల పట్ల సర్కారు చిత్తశుద్ధి ఇదేనా అని డీకే అరుణ ప్రశ్నించారు.

ఇదీ చూడండి:Bandi Sanjay : 'రాష్ట్ర రాజకీయాల్లో సంచలన మార్పులు'

ABOUT THE AUTHOR

...view details