తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రంలో మద్యపానం నిషేధించాలి: డీకే అరుణ - dk aruna fires on govt over liquor shops in national highways

రాష్ట్రంలో మద్యపాన నిషేధం కోసం రెండు రోజులపాటు నిరాహార దీక్ష చేయనున్నట్లు మాజీమంత్రి, భాజపా నాయకురాలు డీకే అరుణ అన్నారు. దిశ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్​ స్పందించడం లేదంటూ అమె మండిపడ్డారు.

రాష్ట్రంలో మద్యపానం నిషేధించాలి: డీకే అరుణ
రాష్ట్రంలో మద్యపానం నిషేధించాలి: డీకే అరుణ

By

Published : Dec 5, 2019, 3:00 PM IST

మద్యపాన నిషేధం కోసం రెండు రోజుల పాటు నిరాహార దీక్ష చేయనున్నట్లు మాజీమంత్రి డీకే అరుణ ప్రకటించారు. ఈ నెల 11,12న "మహిళ సంకల్ప దీక్ష" పేరుతో ఇందిరాపార్క్ లో నిరాహార దీక్ష చేస్తానని ఆమె ఇవాళ హైదరాబాద్‌లో తెలపారు. దీక్షకు అన్ని పార్టీల నేతలు, ప్రజా సంఘాలు, మహిళలు మద్దతు తెలపాలని కోరారు. రాష్ట్రంలో పాలన సాగడం లేదని... ముఖ్యమంత్రి ప్రజల సమస్యలపై మాట్లాడటం లేదని మండిపడ్డారు. దిశ విషయంలో దేశ వ్యాప్తంగా స్పందిస్తున్నా.... రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించలేదని దుయ్యబట్టారు.

జాతీయ రహదారిపై మద్యం దుకాణాలకు ప్రభుత్వం అనుమతి ఎలా ఇచ్చారని డీకే అరుణ ప్రశ్నించారు. నియంత్రణ లేకుండా విచ్చలవిడిగా రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందన్నారు. 2015లో 11 వేల కోట్ల ఆదాయం ఉంటే 2019 లో 20వేల కోట్లకు ఆదాయం పెరిగిందని చెప్పారు.

రాష్ట్రంలో మద్యపానం నిషేధించాలి: డీకే అరుణ

ఇదీ చూడండి: మధ్యప్రదేశ్​లో ఘోర ప్రమాదం- 9 మంది మృతి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details