ఎప్పుడూ ఎవరికో ఒకరికి గొడవలు పెట్టనిదే రాంగోపాల్ వర్మకు తాగిన మత్తు దిగదని.. ఏపీ తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి వర్మ పెట్టిన ట్వీట్‌పై ఆమె స్పందించారు. తెదేపా కోసం సేవ చేయటానికి సిద్ధమని జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారని గుర్తుచేశారు. ఎప్పుడేమి చేయాలో ఎన్టీఆర్‌కు తెలుసనని.. వర్మ సలహా ఆయనకు అక్కర్లేదన్నారు.
తెదేపాపై వర్మ ట్వీట్.. దివ్యవాణి స్ట్రాంగ్ కౌంటర్ - RGV Comments on TDP
రాంగోపాల్ వర్మపై ఏపీ తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి వర్మ పెట్టిన ట్వీట్‌పై ఆమె స్పందించారు. లోకేశ్ సత్తా ఏంటో, గత ప్రభుత్వంలో మంత్రిగా ఎన్ని అవార్డులు వచ్చాయో చూస్తే తెలుస్తుందని పేర్కొన్నారు. వర్మ వత్తాసు పలుకుతున్న జాంబిరెడ్డి లాగా 420 పనులేవీ చేయట్లేదని వ్యాఖ్యానించారు.
వర్మకు దివ్యవాణి కౌంటర్
లోకేశ్ సత్తా ఏంటో, గత ప్రభుత్వంలో మంత్రిగా ఎన్ని అవార్డులు వచ్చాయో చూస్తే తెలుస్తుందని పేర్కొన్నారు. వర్మ వత్తాసు పలుకుతున్న జాంబిరెడ్డి లాగా 420 పనులేవీ చేయట్లేదని వ్యాఖ్యానించారు. వర్మకు పేటీఎం అనే పిచ్చికుక్క కరిసినట్లుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే తాగి వాగితే తెదేపా సైనికులు ఏదో రోజు దేహశుద్ధి చేయక తప్పదని హెచ్చరించారు.