భారీ వర్షాల కారణంగా తిరుమల (Rains in tirumala) కనుమ దారిలో కొండచరియలు విరిగిపడ్డాయి. రెండవ కనుమదారిలోని హరిణికి సమీపంలో రోడ్డుపై బండరాళ్లు పడ్డాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొండ భాగం పూర్తిగా నాని రాళ్లు, చెట్లు విరిగి పడుతున్నాయి. అప్రమత్తమైన తితిదే సిబ్బంది వాటిని ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. భారీ వర్షం కారణంగా అలిపిరి, శ్రీవారి కాలినడక మార్గాలతో పాటు.. పాపవినాశనం రహదారిని తితిదే (TTD) మూసివేసింది.
విమానాలు వెనక్కి...
ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు (Rains in ap) కురుస్తున్నాయి. వర్షాల కారణంగా రేణిగుంట విమానాశ్రయంలో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. వాతావరణం అనుకూలించక విమానాలు తిరిగి హైదరాబాద్ (flights diversion) వెళ్తున్నాయి. ఎయిరిండియా, స్పైస్‌జెట్ విమానాలు హైదరాబాద్‌కు వెనుదిరిగి వెళ్లాయి. హైదరాబాద్-రేణిగుంట ఇండిగో విమానాన్ని విమానాశ్రయ అధికారులు బెంగళూరుకు మళ్లించారు.
జలమయమైన తిరుపతి..
తిరుమలలో విరిగిపడ్డ కొండచరియలు భారీ వర్షాలతో తిరుపతి నగరం (Rains in tirupathi) జలమయమైంది. నగరంలో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. తూర్పు పోలీస్ స్టేషన్ వద్ద వర్షపు నీటితో రైల్వే అండర్ బ్రిడ్జ్‌లు నిండిపోయాయి. కరకంబాడి మార్గంలో భారీగా వరద నీరు చేరింది. దీంతో రాకపోకలు స్తంభించిపోయాయి.
తిరుమల కాలినడక మార్గాలు మూసివేత...
తిరుమలలో విరిగిపడ్డ కొండచరియలు తిరుమల కాలినడక మార్గాలను (tirumala weather) రెండు రోజుల పాటు మూసివేయనున్నట్లు తితిదే (TTD) ప్రకటించింది. నేడు భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. అలిపిరి, శ్రీవారి కాలినడక మార్గాలలో (tirumala weather) భక్తులను అనుమతి నిలిపేస్తూ ఆదేశాలిచ్చింది.గత వారంలో కురిసిన భారీ వర్షాలకు మెట్ల మార్గంలో జలపాతాన్ని తలపించేలా వరద ప్రవహించింది. దీంతో భక్తుల భద్రత దృష్ట్యా రెండు రోజుల పాటు నడక మార్గాలను మూసివేస్తున్నామని తితిదే ఓ ప్రకటన విడుదల చేసింది.
తిరుమలలో విరిగిపడ్డ కొండచరియలు నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం
నైరుతి బంగాళాఖాతంలో చెన్నైకి ఆగ్నేయంగా 310 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపటికి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వాయుగుండం ప్రభావంతో రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిస్తాయని తెలిపారు. దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశముందన్నారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.
ఇదీ చదవండి:Rains Alert: రాగల మూడు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు!