Farmer Minister Narayana bail: పదో తరగతి ప్రశ్నపత్రం లీకు చేశారన్న ఆరోపణల కేసులో మాజీ మంత్రి నారాయణ బెయిల్ మంజూరుకు సంబంధించిన జామీనుదారుల పూచీకత్తును ఏపీలోని చిత్తూరు జిల్లా నాలుగో అదనపు మేజిస్ట్రేట్ కోర్టు ఆమోదించింది. ఈమేరకు మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో గతవారం చిత్తూరు పోలీసులు నారాయణను అరెస్టు చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. ఇద్దరు పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. ఇందుకోసం ఐదు రోజుల గడువు తీసుకున్న నారాయణ తరఫు న్యాయవాదులు.. ఇద్దరు వ్యక్తుల పూచీకత్తును సోమవారం కోర్టులో సమర్పించారు.
నారాయణ బెయిల్ జామీనుదారుల పూచీకత్తుకు కోర్టు ఆమోదం - మాజీ మంత్రి నారాయణ జమీనుదారుల పూచీకత్తు
Farmer Minister Narayana bail: మాజీ మంత్రి నారాయణ బెయిల్ మంజూరుకు సంబంధించి జామీనుదారుల పూచీకత్తును ఏపీలోని చిత్తూరు 4వ అదనపు మేజిస్ట్రేట్ కోర్టు ఆమోదించింది. అయితే.. నారాయణ రాకుండా జామీను తీసుకోవడం కుదరదని స్పస్టం చేసింది.
district-court-approved-farmers-minister-narayana-surety-guarantee-in-papers-leakage-case
అయితే నారాయణ రాకుండా జామీను తీసుకోవడం కుదరదని అభ్యంతరం తెలిపిన మేజిస్ట్రేట్.. ఆయన్ను తమ ముందు హాజరు పరచాలని ఆదేశించారు. దీనిపై నారాయణ తరఫు న్యాయవాదులు ఉన్నత న్యాయస్థానాల తీర్పులను నివేదించడానికి సమయం కోరగా.. విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. నారాయణ తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన కోర్టు.. ఆయన హాజరు కాకుండానే జామీనుదారుల పూచికత్తును ఆమోదించింది.
ఇవీ చదవండి:
- Loan App Case: మళ్లీ రెచ్చిపోతున్న రుణయాప్ నిర్వాహకులు..
- జ్ఞాన్వాపి కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. సర్వే నివేదిక ఆలస్యం!