తెలంగాణ

telangana

ETV Bharat / city

'కేసీఆర్​కు ప్రజల గురించి పట్టించుకునే తీరిక లేదు' - dasoju shravan kumar about corona crisis

తనకు అడ్డువచ్చిన వారిని ఎలా తొలగించాలనే కుట్రలు తప్ప కరోనా కష్టకాలంలో ప్రజలను పట్టించుకోవాలనే ధ్యాసే సీఎం కేసీఆర్​కు లేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. హైదరాబాద్​ పంజాగుట్ట సర్కిల్​లో ఉచిత మాస్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

dasoju shravan kumar, dasoju shravan kumar about corona pandemic, Hyderabad news
దాసోజు శ్రవణ్ కుమార్, ఈటల విషయంపై దాసోజు స్పందన, కరోనా కేసులపై దాసోజు వ్యాఖ్యలు

By

Published : May 2, 2021, 11:07 AM IST

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రించడంలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యమయ్యాయని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం పెద్దన్న పాత్ర పోషిస్తూ.. దేశవ్యాప్తంగా సేవలందిస్తోందని తెలిపారు. హైదరాబాద్ పంజాగుట్ట సర్కిల్​లో సోమాజిగూడ కాంగ్రెస్ అధ్యక్షుడు నరికేల నరేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మాస్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సోనియా గాంధీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా.. కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొవిడ్ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని దాసోజు తెలిపారు. ఆక్సిజన్, రెమ్​డెసివిర్, కరోనా పడకలు అందుబాటులోకి తీసుకురావడం, బాధితులకు సకాలంలో అంబులెన్స్​లు ఏర్పాటు చేయడం వంటి సేవలందిస్తున్నట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details