తెలంగాణ

telangana

ETV Bharat / city

చేపపిల్లల విడుదల కార్యక్రమంలో ప్రొటోకాల్ వివాదం.. అధికార పార్టీ నేతల అసంతృప్తి - చేప పిల్లల విడుదల కార్యక్రమం

Distribution of fish protocal issue: ఖమ్మం జిల్లాలో అధికార పార్టీ నేతల మధ్య ప్రొటోకాల్‌ వివాదం తలెత్తింది. పాలేరులో చేపపిల్లల విడుదల కార్యక్రమం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ప్రొటోకాల్ పాటించకపోవటంపై తెరాస నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. మత్స్యశాఖ అధికారుల తీరుపై మండిపడి, అక్కడి నుంచి వెళ్లిపోయారు.

protocal issue
ప్రొటోకాల్​ వివాదం

By

Published : Sep 18, 2022, 12:46 PM IST

Updated : Sep 18, 2022, 2:56 PM IST

Distribution of fish protocal issue: రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులకు జీవం పోయడానికి, మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నింపి వారి జీవితాల్లో మార్పులు తీసుకోని రావడానికి చేప పిల్లల విడుదల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా విడతల వారీగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెరువుల్లో విడుదల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తాజా ఖమ్మం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టారు.

కానీ ఖమ్మం జిల్లా పాలేరు మండలంలో తలపెట్టిన చేపపిల్లల విడుదల కార్యక్రమంలో అధికార పార్టీ నేతల మధ్య ప్రొటోకాల్ వివాదం తలెత్తింది. పాలేరులో చేపపిల్లల విడుదల కార్యక్రమం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ప్రొటోకాల్ పాటించకపోవటంపై తెరాస నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. మత్స్య శాఖ అధికారుల తీరుపై ఎంపీలు నామానాగేశ్వర రావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు ఆగ్రహించారు.

అధికారులు ఉద్యోగం చేయాలి కానీ.. ఊడిగం చేయెుద్దంటూ తాతా మధు వ్యాఖ్యానించారు. తమకు లేని ఫ్లెక్సీలు మిగతావాళ్లకు ఎందుకని ప్రశ్నించారు. ఎమ్మెల్యే, మంత్రి ఫొటోలు మాత్రమే పెట్టాలని ప్రభుత్వ చెప్పిందా అంటూ మండిపడ్డారు. కార్యక్రమంలో పాల్గొనకుండానే నేతలందరూ అక్కడ్నుంచి వెళ్లిపోయారు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 18, 2022, 2:56 PM IST

ABOUT THE AUTHOR

...view details