తెలంగాణ

telangana

ETV Bharat / city

జంటనగరాల్లో జోరుగా బతుకమ్మ చీరల పంపిణీ - mallareddy

ఆడపడచులకు బతుకమ్మ చీరల పంపిణీ జంటనగరాల్లో జోరుగా సాగుతోంది. పలు ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు సర్కారు అందిస్తున్న బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.

జంటనగరాల్లో జోరుగా బతుకమ్మ చీరల పంపిణీ

By

Published : Sep 24, 2019, 8:44 PM IST

జంటనగరాల్లో బతుకమ్మ చీరల పంపిణీ ఉత్సాహంగా సాగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు వివిధ ప్రాంతాల్లో తెలంగాణ ఆడపడచులకు చీరలు పంచారు. అబిడ్స్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్లతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం అంబర్​పేటలో స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్​తో కలిసి మహిళలకు చీరలను అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక కోటి రెండు లక్షల మంది ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

కర్మన్​ఘాట్​లో సబితా..

చందానగర్​లోని హైటెక్​ సిటీ సైబర్​ కన్వెన్షన్​లో చేవెళ్ల ఎంపీ రంజిత్​రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీలు మహిళలకు చీరలు అందజేశారు. కర్మన్‌ఘాట్‌లో స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో కలిసి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాకర్షక పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు.

మేడ్చల్​ జిల్లాలో మంత్రి మల్లారెడ్డి

మెహిదీపట్నంలో ఎమ్మెల్సీ ప్రభాకర్ చేతుల మీదగా చీరల పంపిణీ జరగగా... కూకట్​పల్లి నియోజకవర్గ పరిధిలోని ఓల్డ్​ బోయిన్​పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పంపిణీ చేశారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్, పోచారం, పీర్జాదిగూడ, ఘట్​కేసర్​లలో కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. రాష్ట్రంలోని మహిళలంతా సంతోషంగా ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.
హైదరాబాద్ నగర శివారు శంషాబాద్ మున్సిపల్, మండలాల్లోని వివిధ ప్రాంతాల్లో బతుకమ్మ చీరలను రాజేంద్రనగర్​ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పంపిణీ చేశారు.

జంటనగరాల్లో జోరుగా బతుకమ్మ చీరల పంపిణీ

ఇవీ చూడండి: 'బతుకమ్మ... తెలంగాణ సంస్కృతికి నిలువుటద్దం'

ABOUT THE AUTHOR

...view details