రాంగోపాల్ వర్మ కార్యాలయం వద్ద దిశ తండ్రి ఆందోళన
11:25 October 11
రాంగోపాల్ వర్మ కార్యాలయం వద్ద దిశ తండ్రి ఆందోళన
వివాదాస్పద చిత్రాల దర్శకుడు రాంగోపాల్ వర్మను ఆడపిల్ల ఉన్న ప్రతి తల్లిదండ్రులు సమాజం నుంచి వెలివేయాలని దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి కోరారు. దిశ ఎన్కౌంటర్ పేరుతో వర్మ తీస్తున్న సినిమాను తెలంగాణ ప్రభుత్వం నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆర్జీవీ కార్యాలయం వద్ద కుటుంబసమేతంగా ఆందోళన చేపట్టారు.
తక్షణమే యూట్యూబ్‌లో ఉన్న దిశ ఎన్కౌంటర్ ప్రచార చిత్రాన్ని తొలగించాలని కోరారు. ఇప్పటికే తమ కుటుంబం ఎన్నో బాధలు అనుభవిస్తోందని, దిశ సినిమా తీసి తమను మరింత కుంగదీయ వద్దని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించనున్నట్టు శ్రీధర్ రెడ్డి తెలిపారు.