తెలంగాణ

telangana

ETV Bharat / city

హైకోర్టుకు దిశ నిందితుల రీపోస్టుమార్టం వీడియో సీడీ - disha case accused second autopsy report

దిశ కేసు నిందితుల రీపోస్టుమార్టం వీడియో సీడీని హైకోర్టుకు ఎయిమ్స్​ వైద్యులు సమర్పించారు. వారంలోగా సమగ్రమైన నివేదికను అందించనున్నట్లు సమాచారం. దిల్లీ వెళ్లిన వారంలోగా సమగ్రమైన నివేదికను పంపిస్తామని ఎయిమ్స్ బృందం పేర్కొంది.

high court
high court

By

Published : Dec 24, 2019, 1:45 PM IST

దిశ నిందితుల రీపోస్టుమార్టం ప్రాథమిక నివేదిక హైకోర్టుకు చేరింది. రిపోర్టును హైకోర్టు రిజిస్ట్రార్‌కు ఎయిమ్స్ వైద్యుల బృందం అందజేసింది. రిపోర్టుతో పాటు వీడియో సీడీని కూడా అందించారు. వారంలోగా సమగ్రమైన నివేదికను ఎయిమ్స్ బృందం అందిచనున్నట్లు సమాచారం. మృతదేహా పరిస్థితి, వాళ్లు మృతి చెందినప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారు.. లాంటి కీలకమైన అంశాలపై సమగ్రమైన నివేదిక తయారు చేసేందుకు మూడు, నాలుగు రోజులు పట్టే అవకాశం ఉందని... దిల్లీ వెళ్లిన వారంలోగా సమగ్రమైన నివేదికను పంపిస్తామని ఎయిమ్స్ బృందం పేర్కొంది.

ఈ కేసులో విచారణకు కోసం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల కమిషన్.. జనవరిలో హైదరాబాద్‌ వచ్చే అవకాశం ఉంది. కేసుకు సంబంధించి పలు అంశాలను చర్చించిన కమిషన్... హైదరాబాద్​లో వీరికి కల్పించాల్సిన సౌకర్యాలపై సీఎస్‌కు లేఖ కూడా రాసింది. దర్యాప్తులో తెలంగాణ వైద్యులు నిర్వహించిన శవ పరీక్ష, ఎయిమ్స్ వైద్యులు నిర్వహించిన రిపోర్టును కూడా పరిశీలించనున్నారు. ఎయిమ్స్ వైద్యులు సమర్పించే రీపోస్టుమార్టం తుది నివేదిక కీలకంగా మారనుంది.

ఇదీ చూడండి: దిశ నిందితుడి భార్యకు 13 ఏళ్లే!... ఆమె 6 నెలల గర్భవతి

ABOUT THE AUTHOR

...view details