తెలంగాణ

telangana

ETV Bharat / city

'రూ. 1200కోట్లతో హైదరాబాద్​లో వరల్డ్​ క్లాస్​ ఆర్​ అండ్​ డీ సెంటర్' - r and d center

హైదరాబాద్​ వేదికగా జరుగుతున్న బయో ఆసియా సదస్సులో మెడికల్ డివైసెస్ పరిశ్రమపై వర్చువల్​గా చర్చ జరిగింది. రాబోయే ఐదేళ్లలో ఈ రంగం 100 బిలియన్ డాలర్ల ఇండస్ట్రీగా ఆవిష్కృతం కానుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రముఖ లైఫ్ సైన్సెస్ కంపెనీ మెడ్ ట్రానిక్స్ 1200 కోట్ల పెట్టుబడితో వరల్డ్ క్లాస్ ఆర్ అండ్ డీ సెంటర్​ను హైదరాబాద్​లో ఏర్పాటు చేయనున్నట్టు కంపెనీ ఉపాధ్యక్షుడు మదన్ క్రిష్ణన్ ప్రకటించారు.

'రూ. 1200కోట్లతో హైదరాబాద్​లో వరల్డ్​ క్లాస్​ ఆర్​ అండ్​ డీ సెంటర్'
'రూ. 1200కోట్లతో హైదరాబాద్​లో వరల్డ్​ క్లాస్​ ఆర్​ అండ్​ డీ సెంటర్'

By

Published : Feb 23, 2021, 7:35 PM IST

రాబోయే ఐదేళ్లలో భారత మెడికల్ డివైసెస్ పరిశ్రమ 100 బిలియన్ డాలర్ల ఇండస్ట్రీగా ఆవిష్కృతం కానుందని బయో ఆసియా సదస్సు అభిప్రాయపడింది. మెడికల్ ఇంప్లాట్స్ తయారీ కంపెనీలకు గ్లోబల్ అవసరాల్లో 20 శాతం వాటా దక్కించుకునే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. బయో ఆసియా సదస్సు సందర్భంగా జరిగిన మెడికల్ టెక్నాలజీస్, భవిష్యత్ అవకాశాలపై ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రముఖ లైఫ్ సైన్సెస్ కంపెనీ మెడ్ ట్రానిక్స్ 1200 కోట్ల పెట్టుబడితో వరల్డ్ క్లాస్ ఆర్ అండ్ డీ సెంటర్​ను హైదరాబాద్​లో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కంపెనీ ఉపాధ్యక్షులు మదన్ క్రిష్ణన్ ప్రకటించారు.

'రూ. 1200కోట్లతో హైదరాబాద్​లో వరల్డ్​ క్లాస్​ ఆర్​ అండ్​ డీ సెంటర్'

మెడ్ ట్రానిక్స్ ప్రకటనను స్వాగతించిన ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం సుల్తాన్​ పూర్​లో ఆవిష్కరించనున్న మెడికల్ డివైసెస్ పార్కు ఆసియాలోనే అతిపెద్దదని ప్రకటించారు. ఇప్పటికే 39 కంపెనీలు కార్యకలాపాలకు చర్యలు తీసుకొని 6500 మందికి ఉపాధి కల్పించినట్టు జయేష్ రంజన్ చెప్పారు. మెడికల్ డివైసెస్​లో ఆర్తోఫెడిక్ ఇంప్లాంట్స్, అల్ట్రాసౌడ్ స్కానర్స్, త్రీడి ప్రింటింగ్ ఇంప్లాంట్స్​కు విస్తృతంగా డిమాండ్ ఉందని, తెలంగాణ రాష్ట్రం పెట్టుబడిదారులకు... ల్యాండ్, యుటిలిటీ స్పేస్​తో పాటు... క్వాలిటీ సప్లై చైన్​ను సైతం బలోపేతం చేస్తోందని తెలిపారు.

ఇదీ చూడండి:ఏఐ విలువలపై రాజీపడితే పెనుముప్పు తప్పదు: సత్యనాదెళ్ల

ABOUT THE AUTHOR

...view details