తెలంగాణ

telangana

ETV Bharat / city

Minister Niranjan Reddy : 'పసల్ బీమా' పథకంతో రైతులకంటే కంపెనీలకే అధిక లాభం - discussion on crop insurance in Telangana Assembly

కేంద్ర సర్కార్ తీసుకువచ్చిన ఫసల్​ బీమా యోజనతో బీమా కంపెనీలకే లబ్ధి చేకూరుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి(Minister Niranjan Reddy) అన్నారు. బీమా పథకంలో మార్పులు చేస్తే కర్షకులకు మేలు జరుగుతుందని చెప్పారు. పంట బీమా, పంట రుణాలు, పంట నష్టపోయిన రైతులకు పరిహారం, ఫసల్ బీమా యోజన అమలుపై అసెంబ్లీ(Telangana Assembly Sessions 2021)లో పలువురు ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

Minister Niranjan Reddy
Minister Niranjan Reddy

By

Published : Oct 8, 2021, 2:46 PM IST

కేంద్రం తెచ్చిన ఫసల్‌ బీమా యోజనతో రైతుల కన్నా బీమా కంపెనీలకు లాభం జరుగుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి(Minister Niranjan Reddy) ఆరోపించారు. 2016-17, 2017-18 సంవత్సరాలకు గాను రూ. 989 కోట్లకుపైగా ఫసల్ బీమా యోజన ప్రీమియం చెల్లించామని శాసనసభలో తెలిపారు. బీమా పథకం నిబంధనల్లో మార్పులు చేస్తేనే రైతులకు మేలు జరుగుతుందని అన్నారు.

"భారీ వర్షాలతో రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో రైతులు పంట నష్టపోయారు.. నష్టపోయిన రైతులకు పరిహారం అందించారో లేదో చెప్పాలి? గులాబ్ తుపాను వల్ల జరిగిన పంట నష్టాన్ని అంచనా వేశారా? పరిహారానికి సంబంధించిన నివేదిక కేంద్రానికి పంపారు? రాష్ట్రంలో ఫసల్ బీమా పథకం అమలవుతోందా? ఏడేళ్లలో ఆ పథకం కింద ఎంత మంది రైతులకు బీమా అందజేశారు? 2018 నుంచి ఎంతమంది రైతులకు రుణమాఫీ చేశారు? పట్టాలు లేని.. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? "అని శాసనసభ(Telangana Assembly Sessions 2021)లో పలువురు ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి(Minister Niranjan Reddy) సమాధానం ఇచ్చారు.

తెలంగాణ రైతు అప్పు చేయకుండా ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో రైతు బంధు పథకం తీసుకొచ్చామని మంత్రి నిరంజన్(Minister Niranjan Reddy) అన్నారు. ఇలాంటి పథకం ప్రపంచంలో ఎక్కడా లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 92 శాతం చిన్న,సన్నకారు రైతులే ఉన్నారని.. వారందరికీ రైతు బంధు అమలవుతోందని చెప్పారు. రాష్ట్రంలో 52 శాతం మంది కౌలు రైతులున్నారని ప్రతిపక్షాలు చేసిన వ్యాఖ్యలు అవాస్తవాలను తెలిపారు. దేశంలోనే తలసరిభూమి ఎక్కువగా ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి వెల్లడించారు.

"2016-17, 2017-18 సంవత్సరాల బీమా ప్రీమియం రైతులకు చెల్లించాం. 2018-19, 2019-20 ఈ రెండేళ్ల ప్రీమియం క్లెయిమ్స్ సెటిల్ అవ్వాలి. ఇప్పటిదాకా బీమా కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, రైతులు.. 989.80 కోట్ల ప్రీమియం చెల్లిస్తే రైతులకు వచ్చింది రూ.817.65 లక్షలు మాత్రమే. మరో 172 కోట్ల రూపాయాలు బీమా కంపెనీలకే వెళ్లాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బీమా పథకం వల్ల రైతుల కంటే బీమా కంపెనీలకే ఎక్కువ లబ్ధి చేకూరుతోంది. ఆ పథకం అశాస్త్రీయంగా ఉంది.. కొత్త విధానాలు రూపొందించి.. కర్షకులకు మేలు కలిగే విధంగా బీమాను అమలు చేయాలి."

- నిరంజన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి

2009 నుంచి 2014 వరకు గత ప్రభుత్వం హయాంలో పెండింగ్​లో ఉన్న ఇన్​పుట్ సబ్సిడీని కూడా కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకోగానే చెల్లించారని నిరంజన్ రెడ్డి(Minister Niranjan Reddy) తెలిపారు. దాదాపు రూ.668 కోట్ల ఇన్​పుట్ సబ్సిడీని చెల్లించినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ.733 కోట్ల పంట రుణఆలను 4 లక్షల 7వేల మంది రైతులకు అందజేసినట్లు వెల్లడించారు. మరో 8 లక్షల 60వేల రైతులకు రూ.1500 కోట్లు ఇవ్వాల్సి ఉందని.. అది ప్రాసెస్​లో ఉందని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details