తెలంగాణ ఆవిర్భావ సమయంలో ఉన్న విద్యుత్ సమస్యను మూడు నెలల్లో పరిష్కరించినట్లు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి(Telangana Power Minister Jagadish Reddy) తెలిపారు. మూడేళ్లలోనే రైతులకు 24 గంటల విద్యుత్‌ను అందించినట్లు శాసనసభలో వివరించారు. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో ఐదో స్థానంలో రాష్ట్రం నిలిచిందని స్పష్టం చేశారు. విద్యుత్ రంగంలో రాష్ట్ర పురోభివృద్ధికి కేసీఆర్ దార్శనికతే కారణమని మంత్రి జగదీశ్ రెడ్డి(Telangana Power Minister Jagadish Reddy) వెల్లడించారు. రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియోగం ఎంత? తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో తెలంగాణ ఏ స్థానంలో ఉంది? రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చడానికి తీసుకుంటున్న చర్యలేవని అసెంబ్లీలో పలువురు శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి(Telangana Power Minister Jagadish Reddy) సమాధానమిచ్చారు.
రాష్ట్రం ఏర్పడే నాటికి ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ సమస్యలు ఎదుర్కొన్నామని మంత్రి(Telangana Power Minister Jagadish Reddy) తెలిపారు. కానీ ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో.. ఆ సమస్యలను త్వరగానే అధిగమించామని అన్నారు. రాష్ట్రంలో ట్రాన్స్మిషన్ వ్యవస్థను బలోపేతం చేసుకుని 17వేల మెగావాట్ల విద్యుత్‌కు డిమాండ్ ఉన్నా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన కరెంట్‌ను అందించే స్థాయికి ఎదిగామని స్పష్టం చేశారు. డిస్కంల ద్వారా 990.. 33కేబీ సబ్స్టేషన్లు ఏర్పాటు చేసి.. 16వేల 48 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని తెలంగాణలో విద్యుత్ సరఫరా సమస్యలేకుండా విజయం సాధించామని వివరించారు.
రాష్ట్రంలో రెండు డిస్కంల ద్వారా కోటి 65 లక్షల కనెక్షన్లు ఇచ్చామని మంత్రి జగదీశ్(Telangana Power Minister Jagadish Reddy) తెలిపారు. తెలంగాణ ఏర్పడే నాటికి కోటి 11 లక్షలు ఉన్న ఈ కనెక్షన్లు ఏడేళ్లలో 54 లక్షలు పెరిగాయని చెప్పారు. తెలంగాణ సాధించుకునే సమయానికి 19 లక్షలు మాత్రమే ఉన్న వ్యవసాయ కనెక్షన్లు రాష్ట్రం వచ్చిన తర్వా 25.63 లక్షల వరకు పెరిగాయని వెల్లడించారు. మరో లక్ష కనెక్షన్లు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయని.. కరోనా వల్ల పోల్స్ తయారీ, ఇతర మెటీరియల్స్ ఉత్పత్తి ఆగిపోవడం వల్ల పెండింగ్ పడ్డాయని అన్నారు.