పార్లమెంట్ సమావేశాల్లో ఏఏ అంశాలు లేవనెత్తాలనే దానిపై చర్చించామని టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. గాంధీభవన్‌లో జరిగిన భేటీకి ఉత్తమ్ సహా ఎంపీలు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కుసుమకుమార్, మధు యాష్కీ, చిన్నారెడ్డి, మల్లు రవి, దాసోజు శ్రవణ్, నాగం జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ చేస్తున్న దోపిడీపై పార్లమెంట్లో చర్చిస్తాం. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టు, మిషన్ భగీరథపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తాం. కేంద్ర పెద్దలతో సహా దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదులు చేస్తాం. నల్లమలలో యురేనియం తవ్వకాలపైనా ప్రస్తావిస్తాం. హైదరాబాద్ నుంచి విజయవాడకు బులెట్ ట్రైన్ వేయాలని డిమాండ్ చేస్తాం. విభజన హామీలైన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం, బయ్యారం ఉక్కు కర్మాగారం వంటి పెండింగ్ అంశాలను లోక్‌సభలో ప్రస్తావిస్తాం. గిరిజన యూనివర్శిటీకి కేవలం రూ.10 లక్షలే కేటాయించారు. ఇంత కంటే దారుణం ఉంటుందా.. భువనగిరి ఆస్పత్రిని ఎయిమ్స్‌గా ఆదునికీకరించాలి. దీనిపైనా పార్లమెంట్లో ప్రస్తావిస్తాం.
- ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు